ETV Bharat / sports

సఫారీలనూ చిత్తు చేసిన టీమ్ఇండియా - జడ్డూ మ్యాజిక్​కు సౌతాఫ్రికా విలవిల - jadeja bowling world cup

ind vs Sa World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్​లో సౌతాఫ్రికాను 243 పరుగుల తేడాతో భారత్​ చిత్తు ఓడించింది.

ind vs sa world cup 2023
ind vs sa world cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 8:34 PM IST

Updated : Nov 5, 2023, 9:47 PM IST

ind vs Sa World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఆదివారం కోల్​కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత్.. 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 326 భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. స్పిన్నర్ రవీంద్ర జడేజా దెబ్బకు 27.1 ఓవర్లలో 83 పరుగులకే చేతులెత్తేసింది. సఫారీ జట్టులో ఏ బ్యాటర్​ కూడా 15 పరుగుల మార్క్ అందుకోలేదు. మార్కో జాన్సన్​ (14 పరుగులు) ఆ జట్టులో టాప్​ స్కోరర్. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, మహ్మద్ షమీ 2, కుల్​దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీకే 'మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

జడ్డూ మ్యాజిక్.. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. సిరాజ్ అద్భుత బంతితో తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్​ (5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత సఫారీ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. పిచ్​ను అంచనా వేసిన కెప్టెన్ రోహిత్.. పవర్​ ప్లే లోనే స్పిన్నర్ రవీంద్ర జడేజాకు బంతినిచ్చాడు. 8.3 ఓవర్​ వద్ద జడ్డూ.. బవూమా (11)ను బౌల్డ్​ చేసి పెవిలియన్ చేర్చాడు. తర్వాత కాసేపు షమీ సఫారీలను శాసించాడు. అతడు స్పల్ప వ్యవధిలోనే మార్​క్రమ్ (9), వాన్​డర్ డస్సెన్ (13)ను వెనక్కిపంపాడు.

ఆ తర్వాత జడేజా తేమగా ఉన్న పిచ్​పై బంతిని గింగిరాలు తిప్పుతూ.. సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బందుల్లోకి నెట్టాడు. వారికి పరుగులు చేయడం అటుంచితే.. జడ్డూ బంతులను ఎదుర్కోవడమే ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే జడేజా.. ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. మిల్లర్ (11), కేశవ్ మహరాజ్ (7), రబాడా (6) ను ఔట్ చేశాడు. ఇక ఆఖర్లో ఎంగ్డీ వికెట్ పడగొట్టిన కుల్​దీప్.. టీమ్ఇండియాకు ఘనమైన విజయాన్ని కట్టబెట్టాడు.

  • Huge congratulations to my lovely husband, Ravindra Jadeja, for his phenomenal 5-wicket haul against South Africa! Your hard work and dedication shine through. Another thrilling victory for India!@imjadeja pic.twitter.com/tprtkTm5Iy

    — Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (40 పరుగులు, 24 బంతుల్లో, 6x4, 2x6) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. దాన్ని విరాట్ (101 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (77 పరుగులు) సద్వినియోగం చేసుకున్నారు. ఈ మ్యాచ్​లో ఓపెనర్ శుభ్​మన్ గిల్ (23), సూర్య (22) పరుగులు బాదాకు. చివర్లో జడేజా (29* పరుగులు) దూకుడుగా ఆడాడు.

  • #WATCH | Kolkata: "It did not look like a World Cup match. It was like a match with some club team...We have never seen India play like this. We enjoyed a lot...," says an Indian fan after India beat South Africa in an ICC World Cup match. pic.twitter.com/2tvLfC0oB3

    — ANI (@ANI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • PM Narendra Modi tweets, "Our cricket team is triumphant yet again! Congratulations to the team for a splendid performance against South Africa. Great teamwork. They have also given a great birthday gift to Virat Kohli, who played a lovely innings today."

    (file pic) pic.twitter.com/JLcD5su3WG

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ రికార్డ్​కు నాకు ఏడాది పట్టింది నువ్వు త్వరగా చేయగలవా? - కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ట్వీట్

వరల్డ్​కప్ - పట్టుబిగించిన భారత బౌలర్లు, సౌతాఫ్రికా విలవిల

Last Updated : Nov 5, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.