IND VS SA: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ జోడీ మరో అరుదైన ఘనత నెలకొల్పింది. గతంలో ధోనీ- రైనా జోడీ సృష్టించిన రికార్డును అధిగమించింది.
ధావన్- కోహ్లీ జోడీ ఇప్పటివరకు 28 సార్లు హాఫ్ సెంచరీలు చేసింది. ధోనీ- రైనాల జోడీ 27 అర్ధశతకాలు నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును సృష్టించింది ధావన్- కోహ్లీ జోడీ. ఈ జాబితాలో భారత దిగ్గజాలు గంగూలీ- సచిన్ జోడీ 55కు పైగా అర్ధశతకాల భాగస్వామ్యంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ- ధావన్ జోడీ(32 అర్ధసెంచరీల భాగస్వామ్యం) ఉంది.
దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో శిఖర్ ధావన్ 35వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 73బంతుల్లో 61 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. దీంతో 0-3 తేడాతో భారత్ వైట్‌వాష్ అయింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇది చూడండి: IND VS SA: ఉత్కంఠపోరులో భారత్ ఓటమి.. క్లీన్‌స్వీప్ చేసిన సఫారీలు