IND Vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులు చేయడంపై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పందించాడు. కోహ్లీ బ్యాటింగ్‌పై తమకు ఎప్పుడూ ఆందోళన కలగలేదని అన్నాడు. బ్యాటింగ్ కోచ్‌గా తనకు.. విరాట్ మెరగ్గా ఆడటం లేదన్న సందేహం ఏనాడూ కలగలేదని తెలిపాడు. విరాట్ ఫామ్ లేమిని అధిగమించి 79 పరుగులు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
"కోహ్లీ షాట్ సెలక్షన్ గతంలో కంటే చాలా మెరుగు పడింది. సరైన ఏకాగ్రత లేకపోవడం కారణంగానే తొలి టెస్టులో విఫలమయ్యాడు. మొదట్లో దక్షిణాఫ్రికా బౌలర్లు కోహ్లీకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కోహ్లీ నుంచి పరుగులు రాకుండా కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌ను కోహ్లీ చాలా ఏకాగ్రతతో ఆడాడు. అతడు సరైన బంతులను ఎంచుకున్నాడు" అని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. మూడోటెస్టులో మరింత మెరుగ్గా ఆడాల్సిందన్నాడు రాఠోడ్.
దక్షిణాఫ్రికాతో మూడోటెస్టులో సారథి కోహ్లీ 79పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 71వ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. రబాడా బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరీన్కు చిక్కి 9వ వికెట్‌గా నిష్క్రమించాడు.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(79;201 బంతుల్లో 12x4,1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పుజారా 77 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి: IND Vs SA: కోహ్లీ మరో రికార్డు.. సచిన్ తర్వాత రెండో స్థానంలో