ETV Bharat / sports

IND vs SA Test: రహానె వద్దు.. విహారి ముద్దు

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉంటే రహానెను తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌. అతడి స్థానంలో విహారిని ఆడించాలని పేర్కొన్నాడు.

Gautam Gambhir
Gautam Gambhir
author img

By

Published : Jan 8, 2022, 6:53 AM IST

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఫామ్‌లో లేని ఆజింక్య రహానెను పక్కన పెట్టాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. జొహానెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో గాయం కారణంగా విరాట్​ తప్పుకోవడం వల్ల కేఎల్‌ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. విరాట్‌ స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇచ్చారు.

మూడో టెస్టుకు కోహ్లీ తిరిగొస్తాడని భావిస్తున్న నేపథ్యంలో గౌతి మాట్లాడుతూ.. "చాలా రోజులుగా రహానె ఎలా ఆడుతున్నాడో అంతా చూస్తున్నారు. మూడో టెస్టుకు కోహ్లి వస్తే రహానెను తుది జట్టు నుంచి తప్పించాలి. విరాట్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. రహానె స్థానంలో విహారిని అయిదో స్థానంలో ఆడించాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే రహానెకు ఇలా అవకాశాలు ఇస్తూ పోతుంటే జట్టులో కుదురుకునేందుకు విహారికి మరింత సమయం పడుతుంది" గంభీర్‌ అన్నాడు.

రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో విహారి 20, 40 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రహానె.. రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులు సాధించాడు.

భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1 సమం చేసింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్‌ డీన్ ఎల్గర్‌ (96*) చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి విజయతీరాలకు చేర్చాడు. జనవరి 11 నుంచి ఆఖరి టెస్టు మ్యాచ్‌ కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించింది.

ఇదీ చూడండి: 'స్టెయిన్‌- మోర్కెల్‌ స్పెల్‌ అత్యుత్తమం అని సచినే చెప్పాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.