ETV Bharat / sports

IND VS SA: 'సిరీస్​ గెలవకపోతే రిస్క్​లో కోహ్లీ టెస్ట్​ కెప్టెన్సీ' - IND VS South africa

Monty Panesar about Kohli Test captaincy: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియాకు సిరీస్​ను సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెట్​ మాంటీ పనేసర్​. ఈ సిరీస్​లో ఒకవేళ భారత్​ ఓడిపోతే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ కూడా అనుమానమేనని​ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ, kohli test captaincy
కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ
author img

By

Published : Dec 25, 2021, 7:31 PM IST

Monty Panesar about Kohli Test captaincy: దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్​లో టీమ్​ఇండియానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ మాంటీ పనేసర్​. ఈ సిరీస్​లో భారత జట్టు గెలవకపోతే టెస్ట్​ కెప్టెన్​గా కోహ్లీ కొనసాగడం కష్టమేనని అన్నాడు.

"టీమ్​ఇండియాకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నా. ఈ సిరీస్​లో వారు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. రవిశాస్త్రి కోచింగ్​ ఫిలాసఫీతో వాళ్లకు ఎలా గెలవాలో తెలుసని నా అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడగలిగేలా ఆటగాళ్లలో నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని అతడు నింపాడు. కాబట్టి దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్​ఇండియా తొలిసారి టెస్ట్​ సిరీస్​లో గెలుపొంది చారిత్రక విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నా. దక్షిణాఫ్రికా కన్నా భారత జట్టు బలంగా ఉంది. టీమ్​లో అద్భుత ప్లేయర్లు ఉన్నారు." అని పనేసర్​ పేర్కొన్నాడు.

ఫామ్​లో లేని కారణంగా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ఆ బాధ్యతలను రోహిత్​ శర్మకు అప్పగించారు. అయితే ఈ పరిణామం కోహ్లీలో స్ఫూర్తిని నింపుతుందని అన్నాడు పనేసర్​.

"ఈ సంఘటన విరాట్​లో మరింత స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నా. ఎందుకంటే అతడు భారీ పరుగులు చేయలేకపోతే టెస్ట్​ కెప్టెన్​గానూ అతడని తప్పించే అవకాశముంది. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ విరాట్​ పరుగులు సరిగ్గా చేయలేనప్పటికీ సిరీస్​ గెలిస్తే తనపై అంతగా ప్రభావం పడదు. కాబట్టి అతడు దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్​ ఎలా గెలవాలనే విషయమై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బీసీసీఐ కూడా విరాట్​ నుంచి దీన్నే ఆశిస్తుందని నా అభిప్రాయం." అని పనేసర్​ వెల్లడించాడు.

వన్డే కెప్టెన్​గా కోహ్లీ స్థానంలో రోహిత్​శర్మను నియమించడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి మద్దతుగా నిలిచాడు పనేసర్​. బోర్డు సరైన నిర్ణయమే తీసుకుందని అన్నాడు. దక్షిణాఫ్రికా పిచ్​లు పేస్​, బౌన్సీగా ఉంటాయని చెప్పిన పనేసర్​.. టీమ్​ఇండియాకు ఆ పిచ్​లపై ఆడటం సవాల్​లాంటిదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఆఫ్​ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​కు ఇది పెద్ద ఛాలెంజ్​ అని పేర్కొన్నాడు.

టీమ్​ఇండియాకు ప్రధానంగా వేదిస్తున్న సమస్య మిడిలార్డర్. రహానె, పుజారా ఫామ్​లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు​ మంచి ప్రదర్శన చేయాలి ఎందుకంటే శ్రేయస్​ అయ్యర్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. మూడో స్థానంలో రహానె లేదా పుజారాకు బదులుగా అతడిని ఆడించే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్​ఇండియా ఎప్పుడూ మంచి ఆటగాళ్లను తయారు చేస్తూనే ఉంటుంది. ఇక కోహ్లీ తుది జట్టులోకి ఆటగాళ్లని తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి." అని మానేసర్​ అన్నాడు.

ఇదీ చూడండి: Ind vs SA: సఫారీ గడ్డపై కూడా ఈ వేగం కొనసాగనీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.