ETV Bharat / sports

ద్రవిడ్​తో కలిసి కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​.. మూడో టెస్టుకు అందుబాటులోకి! - టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

IND Vs SA Kohli third test: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడో టెస్టుకు టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నెట్స్​లో కోచ్​ ద్రవిడ్​తో కలిసి విరాట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన అభిమానులు వీడియోను వైరల్​ చేస్తున్నారు.

కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​, kohli net practice
కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​
author img

By

Published : Jan 6, 2022, 8:59 AM IST

IND Vs SA Kohli third test: వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన సారథి కోహ్లీ.. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అతడు తిరిగి ఫిట్​నెస్​ సాధించేండుకు కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్​లో చెమటోడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారంది. ఈ వీడియోలో టీమ్​ఇండియా కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ త్రోడౌన్​ బౌలింగ్​ చేస్తుండగా కోహ్లీ ఆడుతున్నాడు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. జనవరి 11న కేప్​ టౌన్​లో మూడో టెస్టు​ ప్రారంభంకానుంది. ఒకవేళ కోహ్లీ.. ఈ మ్యాచ్​ ఆడితే అతడికిది 99వ టెస్టు అవుతుంది.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు​లో టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్​ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. ప్రొటీస్​ జట్టుకు 122 పరుగులు అవసరం.

ఇదీ చూడండి: కోహ్లీ కోలుకుంటున్నాడు.. త్వరలోనే ఆడతాడు: పుజారా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.