ETV Bharat / sports

IND VS SA Kohli Birthday : సౌతాఫ్రికాతో మ్యాచ్​.. స్టేడియంలో 70 వేల కోహ్లీ​ మాస్క్‌లతో గ్రాండ్​గా బర్త్​ డే వేడుకలు! - కోహ్లీ పుట్టినరోజు వేడుకలు

IND VS SA Kohli Birthday : ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్ 5న ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమ్​ఇండియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఆ రోజే టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో మ్యాచ్​ రోజు ఘనంగా విరాట్ బర్త్​ డే సెలబ్రేషన్స్​ ప్లాన్ చేస్తున్నారట.

IND VS SA Kohli Birthday : సౌతాఫ్రికాతో మ్యాచ్​.. 70 వేల కోహ్లీ​ మాస్క్‌లతో గ్రాండ్​గా బర్త్​ డే వేడుకలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 11:23 AM IST

IND VS SA Kohli Birthday : ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌ 2023లో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆరు విజయాలతో పాయింట్స్​ టేబుల్​లో టాప్​ పొజిషన్​లో ఉన్న టీమ్​ఇండియా.. తన తర్వాతి మ్యాచ్​ను నవంబర్‌ 5న బలమైన దక్షిణాఫ్రికాతో పోటి పడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens IND VS SA) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఏర్పడింది.

అదేంటంటే.. ఆ రోజే టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli Birthday) 35వ పుట్టిన రోజు కావడం విశేషం. దీంతో పుట్టిన రోజు విరాట్​ శతకం బాదాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. అలానే ఈడెన్‌ గార్డెన్స్​లో కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బెంగాల్‌ క్రికెట్ సంఘం (క్యాబ్) కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ స్టేడియం సామర్థ్యం 68 వేలు. అయితే ప్రతి అభిమాని విరాట్​ ఫేస్‌ మాస్క్‌ను ధరించేందుకు వీలుగా 70 వేల ఫేస్‌ మాస్క్‌లను అందుబాటులో ఉంచేందుకు క్యాబ్​ ఏర్పాట్లు చేస్తోందట. ఇంకా మ్యాచ్‌ ముగిసిన వెంటనే విరాట్​తో బౌండరీ లైన్‌ వద్ద కేక్ కటింగ్‌తో పాటు బహుమతి అందజేయాలని అనుకుంటుందట. అలాగే ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను క్యాబ్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు షా కూడా అంగీకరించినట్లు బెంగాల్ క్రికెట్ సంఘం వర్గాలు సమాచారాన్ని తెలిపాయి. మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయట.

పాక్ క్రికెటర్ స్పెషల్ విషెస్.. పాక్ క్రికెటర్​ రిజ్వాన్‌.. కోహ్లీకి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. పుట్టిన రోజు 'కింగ్' సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. "నవంబర్ 5న కోహ్లీ బర్త్​ డే అని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను పుట్టిన రోజు వేడుకలు చేసుకోను. కానీ విరాట్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు కోహ్లీకి మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అతడు బర్త్​ డే రోజు 49వ వన్డే సెంచరీని అందుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ వరల్డ్​ కప్​లో 50వ వన్డే సెంచరీని కూడా సాధించాలని కోరుకుంటున్నాను" అని రిజ్వాన్‌ పేర్కొన్నాడు.

ODI World Cup 2023 IND VS ENG : ఈ సారి 'బెస్ట్‌ ఫీల్డర్‌'లో బిగ్​ ట్విస్ట్‌.. ఇంతకీ ఎవరు అందుకున్నారంటే?

Ballon D'Or Award Messi : బెస్ట్​ ఫుట్‌బాలర్​గా మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.