IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా నిలకడగా ఆడుతోంది. టీ బ్రేక్ సమయానికి టీమ్‌ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. తొలి సెషన్‌లో అధిపత్యం ప్రదర్శించిన భారత్.. రెండో సెషన్‌లో కాస్త వెనకబడింది.ఈ సెషన్ ఆరంభంలో అర్ధశతకం సాధించిన మయాంక్ అగర్వాల్ (60) కాసేపటికే వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ ఔటవ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికా రివ్యూ (సమీక్ష) కోరింది. అక్కడ ఫలితం సౌతాఫ్రికాకు అనుకూలంగా రావడం వల్ల టీమ్‌ఇండియా తొలి వికెట్ కోల్పోయింది.
మయాంక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా (0) గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే రాహుల్ అర్ధశతకం అందుకున్నాడు. అతడికిది టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ. 57 ఓవర్లు పూర్తయ్యాక అంపైర్లు టీ విరామం ప్రకటించారు. అంతకుముందు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది టీమ్‌ఇండియా.
పుజారాపై ట్రోలింగ్
Pujara Golden Duck: టీమ్‌ఇండియా టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా మరోసారి నిరాశపరిచాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకట్టుకులేకోపోయిన అతడు తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు ఆటలోనూ అదే చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. బ్యాటింగ్‌కు దిగిన అతడు పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆడిన తొలి బంతికే క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 40వ ఓవర్లో ఎంగిడి వేసిన మూడో బంతికి పుజారా ఔట్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై పుజారా డకౌట్ కావడం ఇది రెండోసారి. 2017-18 సౌతాఫ్రికా పర్యటనలో సెంచురియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎంగిడి బౌలింగ్‌లోనే రనౌట్ అయ్యాడు. కాగా, 2020 నుంచి అతడు ఇప్పటివరకు నాలుగుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు అభిమానులు.
ఇదీ చూడండి: IND Vs SA: లంచ్ బ్రేక్.. టీమ్‌ఇండియా స్కోరు 83/0