ETV Bharat / sports

IND Vs SA: కేఎల్​ రాహుల్​ సెంచరీ.. తొలి రోజు భారత్​దే - కేఎల్ రాహుల్ సెంచరీ

IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్​ తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమ్​ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్​ రాహుల్(122*), రహానె(40) ఉన్నారు.

కేఎల్​ రాహుల్​ సెంచరీ, KL rahul century
కేఎల్​ రాహుల్​ సెంచరీ
author img

By

Published : Dec 26, 2021, 8:57 PM IST

Updated : Dec 26, 2021, 9:48 PM IST

IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. కేఎల్​ రాహుల్​(122*) సెంచరీ, మయాంక్​ అగర్వాల్​(60) ధనాధన్​ ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల ఆటముగిసే సమయానికి టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది. మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆసీస్​ బౌలర్లలో నింగిడి ఒక్కడే మూడు వికెట్లు తీయడం విశేషం. ప్రస్తుతం క్రీజులో రాహుల్​, రహానె ఉన్నారు.

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. తొలి సెషన్​లో ఓపెనర్లు కేఎల్​ రాహుల్​(122*) మయాంక్‌ అగర్వాల్ (60) అదరగొట్టారు. అయితే రెండో సెషన్ ఆరంభంలోనే వీరిద్దరి జోడీని విడగొట్టాడు లుంగి ఎంగిడి. ఇతడి బౌలింగ్​లో మయాంక్​ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత అంపైర్‌ ఔటవ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికా రివ్యూ (సమీక్ష) కోరింది. అక్కడ ఫలితం సౌతాఫ్రికాకు అనుకూలంగా రావడం వల్ల టీమ్‌ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. దీంతో తొలి వికెట్​కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

మయాంక్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా(0) గోల్డెన్‌ డకౌటయ్యాడు. దీంతో భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రాహుల్​తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలోనే టీ విరామం సమయానికి రెండు వికెట్లు కోల్పోయి​ 157 పరుగులు చేసింది టీమ్​ఇండియా.

మూడో సెషన్​లో జాగ్రత్తగా ఆడుతున్న విరాట్​(35) మళ్లీ లుంగిడీనే దెబ్బతీశాడు. అతడు వేసిన 68.2 బంతికి క్లీప్​లో ముల్డర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 199 పరుగుల వద్ద మూడో వికెట్​ను కోల్పోయింది టీమ్​ఇండియా. ఆ తర్వాత క్రీజులో వచ్చిన అజింక్యా రహానె(40) రాహల్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలోనే కేఎల్​ శతకం పూర్తి చేసుకున్నాడు. కేశవ్​ మహారాజ్​ వేసిన 77.5 బంతికి ఫోర్​ బాది మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిది ఏడో సెంచరీ కావడం విశేషం.

రెండో ఓపెనర్​గా

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్​ సెంచరీ సాధించిన రెండో ఓపెనర్​గా రాహుల్​ రికార్డుకెక్కాడు. అంతకుముందు వసీమ్​ జాఫర్​ 2006-07లో జరిగిన ఓ టెస్ట్​ మ్యాచ్​లో 116పరుగులు సాధించాడు.

ఇదీ చూడండి: కేఎల్​ రాహుల్​-మయాంక్​ రికార్డు.. 11ఏళ్లలో ఇదే తొలిసారి

Last Updated : Dec 26, 2021, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.