IND vs SA: మ్యాచుల్లో అంపైర్ల తప్పిదాలు సహజం.. అయితే థర్డ్‌అంపైర్ కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తుంటుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇలానే రెండు సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. అందులో ఒకటి భారత సారథి కేఎల్ రాహుల్ ఔట్ కాగా.. రెండోది దక్షిణాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డస్సెన్‌ది. తొలుత భారత సారథి కేఎల్ రాహుల్ విషయానికొస్తే.. అప్పటికే 27 పరుగుల లోటుతో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్ (8) జాన్‌సెన్ బౌలింగ్‌లో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో మార్‌క్రమ్ చేతిలో పడింది. అయితే ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌గా ఔట్ ఇచ్చి థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. సమీక్షించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే మొగ్గు చూపడంతో రాహుల్ అసహనంగా పెవిలియన్‌కు చేరాడు. అయితే మార్‌క్రమ్ క్యాచ్ అందుకునే సమయానికే బంతి నేలను తాకినట్లు రిప్లేలో కనిపించినట్లు భారత అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
ఇక మరో సంఘటన.. ఆతిథ్య జట్టు బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డస్సెన్ ఔటైన విధానం కూడా చర్చకు దారితీసింది. టీమ్‌ఇండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో డస్సెన్ (1) కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ ఇచ్చాడు. దానిని అందుకున్న పంత్, బౌలర్ శార్దూల్ అప్పీల్ చేయడంతో అంపైర్ ఎరాస్మస్ ఔట్‌గా ప్రకటించాడు. డస్సెన్ డీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో పంత్ అందుకునేలోపే బంతి నేలను తాకినట్లుగా అనిపించడంతో కాంట్రవర్సీకి కారణమైంది. లంచ్ బ్రేక్ సమయంలో అంపైర్లతో దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్, జట్టు మేనేజర్ ఖమోత్సో మసుబెలెలె చర్చించారు. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ నిర్ణయంతో లంచ్ తర్వాత డస్సెన్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఫ్రంట్ కెమెరాతో బంతి నేలను తాకినట్లు కనిపించినా.. సైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం క్యాచ్ అందుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదని తేలింది.
ఇదీ చదవండి: