ETV Bharat / sports

IND vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరికి చోటు! - భారత్ దక్షిణాఫ్రికా మూడో టెస్టు ఇషాంత్ శర్మ

IND vs SA 3rd Test: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. వాండరర్స్‌ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. దీంతో మూడో మ్యాచ్​లో అతడి స్థానంలో ఏ బౌలర్​ను తీసుకోవాలనే విషయం టీమ్ఇండియాకు తలనొప్పిగా మారింది.

mohammed siraj
mohammed siraj
author img

By

Published : Jan 9, 2022, 6:34 AM IST

IND vs SA 3rd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. వాండరర్స్‌ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. కోచ్‌ ద్రవిడ్‌ కూడా అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేమని అన్నాడు. నిర్ణయాత్మక టెస్టుకు అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే ఇప్పుడు భారత జట్టు ముందున్న ప్రశ్న.

సిరాజ్‌ అందుబాటులో లేకుంటే అతను ఖాళీ చేసే స్థానం కోసం ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు. 100కు పైగా టెస్టులాడిన 33 ఏళ్ల ఇషాంత్‌ ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేడు. 51 టెస్టులు ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ ఈ మధ్య ఇషాంత్‌ కన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ ద్రవిడ్‌ ఇషాంత్‌ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అతడి ఎత్తు. 6 అడుగుల మూడున్నర అంగుళాల ఇషాంత్‌.. ఇబ్బందికర లెంగ్త్‌లతో బ్యాటర్లకు సమస్యలు సృష్టించగలడని భావిస్తున్నారు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్లు జాన్సన్‌, ఒలీవర్ అదే చేశారు.

"వాండరర్స్‌లో బంతి అస్థిరంగా బౌన్సయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. అది వారి ఎత్తు వల్ల కావొచ్చు. ఒక బంతి ఎక్కువ, ఒక బంతి తక్కువగా లేచే పిచ్‌పై అదనపు ఎత్తు బౌలర్‌కు లాభించవచ్చు. వాళ్లంతగా అస్థిర బౌన్స్‌ మన బౌలర్లకు లభించలేదనిపించింది" అని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు.

సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా ఇషాంత్‌నే తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. "పొడవాటి ఫాస్ట్‌ బౌలర్‌ లేకపోవడం రెండో టెస్టులో మనకు ప్రతికూలాంశమైంది. అలా మనకున్న ఏకైక పేసర్‌ ఇషాంత్‌. ఇలాంటి పిచ్‌లపై ఉమేశ్‌ కంటే అతణ్ని తీసుకుంటేనే మంచిదన్నది నా అభిప్రాయం. భారత పిచ్‌లపై అయితే ఉమేశ్‌ను ఆడించవచ్చు" అని అన్నాడు.

ఇవీ చూడండి: IND vs SA: 'ఆ విజయం యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.