IND vs SA 3rd Test: సిరీస్ ఫలితం తేల్చే కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం లంచ్ సమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు స్వల్ప వ్యవధిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) కాసేపు క్రీజ్‌లో నిలబడినా వరుస ఓవర్లలో వికెట్లను సమర్పించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఛెతేశ్వర్ పుజారా (26*), విరాట్ కోహ్లీ (15*) మరో వికెట్ పడనీయకుండా మొదటి సెషన్‌ను ముగించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 42 పరుగులు జోడించారు. సఫారీల బౌలర్లలో రబాడ, ఒలివియన్ చెరో వికెట్ తీశారు.
బౌలింగ్‌కు స్వర్గధామంగా నిలిచే కేప్‌టౌన్ పిచ్ మీద నిలకడగా ఆడితేనే పరుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టే వీలైనంత ఎక్కువ సమయం క్రీజ్‌లో పాతుకుపోయేందుకు బ్యాటర్లు ప్రయత్నించాలి. తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డ మీద సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తున్న తరుణంలో టీమ్‌ఇండియా భారీగా స్కోరు చేయాల్సిందే. రబాడ, ఒలివియర్, జాన్‌సెన్, ఎంగిడి వంటి బౌలర్లను ఎదుర్కోవడానికి మరింత శ్రమించాలి.
ఇదీ చదవండి:
IND vs SA Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్