ETV Bharat / sports

గత 15 ఏళ్లలో ఇదే అత్యంత పెద్ద మ్యాచ్​: డీన్ ఎల్గర్ - విరాట్​ కోహ్లీ

Ind vs SA 3rd Test: టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ.. ప్రపంచ స్థాయి ఆటగాడని కొనియాడాడు దక్షిణాఫ్రికా సారథి డీన్​ ఎల్గర్​. భారత జట్టులోకి అతడి రాకతో ఇరు జట్ల మధ్య జరగబోయే మూడో టెస్టు.. గత దశాబ్దకాలంలోనే అత్యంత పెద్ద మ్యాచ్​గా నిలవనుందని అన్నాడు.

ind vs sa 3rd test
Virat Kohli
author img

By

Published : Jan 10, 2022, 10:23 PM IST

Ind vs SA 3rd Test: టీమ్ఇండియాతో సిరీస్​ డిసైడర్ మ్యాచ్​ కోసం సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. భారత జట్టులోకి కెప్టెన్​ విరాట్ కోహ్లీ తిరిగిరావడం వల్ల ఈ టెస్టు.. గత 10-15ఏళ్లలో జరిగే అత్యంత తీవ్రమైన పోరుగా మారనుందని చెప్పాడు.

"విరాట్​ ఉంటే ఆట మరో స్థాయిలో ఉంటుంది. నేను అతన్ని మిస్ అవలేదు. భారత జట్టే అతడి సూచనలను, వ్యూహాలను మిస్ అయ్యింది. విరాట్​.. ప్రపంచ స్థాయి ఆటగాడు. విరాట్ పేరే అతడి గురించి చెబుతుంది. అయితే ప్రత్యర్థి ఎవరన్నది మాకు ముఖ్యం కాదు. జట్టుగా.. ముందు మాపైనే దృష్టిసారిస్తాం."

-డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా కెప్టెన్

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా.. జనవరి 11 నుంచి టెస్టు సిరీస్​లో ఆఖరిదైన మూడో మ్యాచ్​ ఆడనుంది. ఇప్పటికే 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సఫారి గడ్డపై తొలి టెస్టు సిరీస్​ విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది భారత్. ఈ క్రమంలో గత 10-15 ఏళ్లలో ఇదే అత్యంత పెద్ద టెస్టు పోరుగా నిలవనుందని అన్నాడు డీన్ ఎల్గర్.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు.. కోహ్లీ ఈ రికార్డు సాధించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.