IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే రాహుల్ చేసిన ఓ పని ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్కు కోపం తెప్పించింది. దీంతో అతడిని మందలించాడు.
ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను రబాడ వేశాడు. అయితే ఇతడు బంతి వేసే సమయంలోనే రాహుల్ తాను సిద్ధంగా లేనంటూ క్రీజు నుంచి పక్కకు జరిగాడు. అనంతరం రబాడకు క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఆలస్యంగా యాక్షన్‌ను ఆపేయడంపై రాహుల్‌ను మందలించాడు అంపైర్ ఎరస్మస్. 'కాస్త తొందరగా ప్రయత్నించూ' అంటూ అతడికి సూచించాడు. మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వల్ల వారి మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
-
Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022Marais is a sweet guy #INDvSA. As is the stand-in captain pic.twitter.com/KVQNqUPt06
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 3, 2022
టీ బ్రేక్
ఇక ఈ మ్యాచ్‌లో టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది టీమ్ఇండియా. పుజారా (3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ (50) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విహారి (20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ప్రస్తుతం పంత్ (13), అశ్విన్ (24) క్రీజులో ఉన్నారు.