ETV Bharat / sports

చరిత్రలో అతిచిన్న మ్యాచ్​గా సెకండ్ టెస్ట్- కేప్​టౌన్​లో భారత్ బోణీ- 33వికెట్లు పేసర్లకే! - IND vs SA history

IND Vs SA 2nd Test Records : సఫారీ గడ్డపై టీమ్​ఇండియా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్​ చరిత్ర సృష్టించింది.

IND Vs SA 2nd Test Records
IND Vs SA 2nd Test Records
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 6:55 PM IST

IND Vs SA 2nd Test Records : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం పాలైన భారత్‌ జట్టు, రెండో టెస్టులో ఘన విజయం సాధించి సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంది. రోజున్నరలోనే ముగిసిన ఈ టెస్ట్‌లో సఫారీ బ్యాటర్లలకు భారత పేసర్లు చుక్కలు చూపించారు.

టీమ్​ఇండియాకు ఇదే తొలి విజయం!
తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సిరాజ్‌ నిప్పులు చెరగ్గా, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో బుమ్రా ప్రొటీస్‌ పతనాన్ని శాసించాడు. 107 ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 33 వికెట్లు నేలకూలగా అన్ని వికెట్లు సీమర్లకే పడ్డాయి. సౌతాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్​ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది. కేప్‌టౌన్‌ మైదానంలో టీమ్​ఇండియాకు ఇదే తొలి విజయం.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో!
1935లో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ 109 ఓవర్లలో ముగియగా, ఈ మ్యాచ్‌ కేవలం 107 ఓవర్లలోనే ముగిసింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టెస్ట్‌ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్‌-ఇంగ్లాండ్‌ మధ్య 1935లో జరిగిన మ్యాచ్‌ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్‌ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్‌(లార్డ్స్‌) ఐదో స్థానంలో (792) ఉన్నాయి.

ధోనీ తర్వాత రోహితే!
మాజీ కెప్టెన్​ ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్‌ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఘనత సాధించాడు. 2010-11 సీజన్‌లో మిస్టర్ కూల్ కెప్టెన్సీలో టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించింది టీమ్​ఇండియా. ఆ జట్టుతో జరిగిన మొత్తం ఎనిమిది సిరీసుల్లో ఏడింట్లో(1992-93, 1996-97, 2001-02, 2006-07, 2013, 2018, 2021-22) భారత్ ఓటమిపాలైంది. ఇప్పుడు సౌతాఫ్రికాతో సిరీస్ సమం చేసింది రోహిత్ సేన.

తొలి ఆసియా జట్టుగా చరిత్ర!
ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సిరాజ్‌ నిలవగా, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడిన డీన్‌ ఎల్గర్‌తోపాటు బుమ్రా నిలిచాడు. దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్​ఇండియా సంతృప్తికరంగా ముగించింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్‌, టీ20 సిరీస్‌, టెస్ట్‌ సిరీస్‌లను డ్రా చేసుకుంది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.