ETV Bharat / sports

IND vs SA: తొలి రోజు ముగిసిన ఆట.. దక్షిణాఫ్రికా 35/1 - IND vs SA 2nd Test live updates

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది. సఫారీ జట్టు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది.

IND vs SA Test
IND vs SA
author img

By

Published : Jan 3, 2022, 9:24 PM IST

వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే సఫారీలకు షాక్‌ తగిలింది. మహమ్మద్ షమి వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్‌ (14)తో కలిసి డీన్‌ ఎల్గర్‌ (11) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి ఒక వికెట్‌ పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు భారత బౌలర్లు చెలరేగి.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

అంతకు ముందు, టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (46: 50 బంతుల్లో 6×4) అర్ధ శతకం చేజారినా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (26), హనుమ విహారి (20), రిషభ్‌ పంత్‌ (17), మహమ్మద్‌ షమి (9), మహమ్మద్ సిరాజ్‌ (1) పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్‌ కాగా.. జస్ప్రీత్‌ బుమ్రా 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా (3), అజింక్య రహానె (0) మరోసారి చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్‌ నాలుగు, ఒలివర్‌ మూడు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.