IND vs SA 2021: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేల నేపథ్యంలో ఆ దేశానికి చేరుకుంది టీమ్ఇండియా. విరాట్ కోహ్లీ సారథ్యంలో డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆటగాళ్ల ఫొటోలను పోస్ట్ చేసింది.
![IND vs SA 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13926402_imh3.jpg)
అంతకు ముందు దక్షిణాఫ్రికా పర్యటనకు ముంబయి విమానాశ్రయం నుంచి బయలుదేరింది కోహ్లీసేన. జనవరిలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా ఈ టూర్లో భాగమైన టీ20 సిరీస్ను మాత్రం వాయిదా వేశారు. రెండు జట్లు బయోబబుల్లోనే ఉండనున్నాయి.
![IND vs SA 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13926402_img1.jpg)
టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీనే సారథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు.
![IND vs SA 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13926402_img4.jpg)
ఇదీ చదవండి:విండీస్ జట్టులో మరో ఐదుగురికి కరోనా