IND vs SA Test: వాతావరణం అనుకూలించకపోవడం వల్ల భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆలస్యంకానుంది. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా అక్కడ తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం కన్నా ఆలస్యం కానుందని బీసీసీఐ తెలిపింది. కాసేపటి క్రితమే మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు ఇంకా వర్షం తగ్గక పోవడం వల్ల లంచ్ తర్వాత మ్యాచ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. మరోసారి మైదానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా తొలి రోజు 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122*).. అజింక్యా రహానే (40*) క్రీజులో ఉన్నారు. మయాంక్ (60), కోహ్లీ (35) రాణించగా పుజారా (0) విఫలమయ్యాడు. ఈ ముగ్గుర్నీ ఎంగిడి ఔట్ చేయడం విశేషం.