ETV Bharat / sports

Ind Vs Pak World Cup 2023 : 'క్రెడిట్ మొత్తం అతనికే.. కానీ పాకిస్థాన్​ మాత్రం ఇలా..' - వన్డే ప్రపంచకప్​ 2023 మ్యాచెస్​

Ind Vs Pak World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా గత శనివారం భారత్​ పాక్​ మధ్య జరిగిన హోరా హోరీ పోరులో విజయం టీమ్​ఇండియాను వరించిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు టీమ్​ఇండియాను మాజీలు కొనియాడుతున్న వేళ.. పాక్​ ఓటమి పట్ల ఆ జట్టు మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్​ మాజీ కెప్టెన్ ముస్తాక్ మహ్మద్ పాక్​ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Ind Vs Pak World Cup 2023
Ind Vs Pak World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 2:17 PM IST

Updated : Oct 18, 2023, 2:23 PM IST

Ind Vs Pak World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్​లో గెలుపు టీమ్ఇండియాను వరించిన సంగతి అందరికీ తెలిసిందే. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోహిత్​, శ్రేయస్​ లాంటి స్టార్​ ప్లేయర్స్​ వల్ల నిర్ణీత చిన్న లక్ష్యాన్ని టీమ్ఇండియా ఈజీగా సాధించింది. దీంతో ప్రస్తుతం రోహిత్​ సేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎక్కడ చూసిన వీరి గురించే చర్చలు నడుస్తోంది. అయితే పాక్​ ఓటమి పట్ల ఆ జట్టు మాజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఓటమిని తాము ఊహించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్​ మాజీ కెప్టెన్ ముస్తాక్ మహ్మద్ పాక్​ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

"ప్రతి విభాగంలోనూ భారత్.. పాకిస్థాన్‌ను అధిగమించిందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓ కెప్టెన్‌గా మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన రోహిత్ శర్మకు ఈ క్రెడిట్ తప్పక దక్కుతుంది. అయితే పాకిస్థాన్​ జట్టు మాత్రం తమ ఓటమిని తామే సృష్టించుకున్నారు. 2 వికెట్ల నష్టానికి జట్టు స్కోర్​ 155 ఉన్నప్పుడు కొన్ని చెత్త షాట్లు ఆడి నిరాశపరిచారు. తద్వారా 191 పరుగులకే దుర్భరమైన ఓటమిని చవిచూశారు. బౌలింగ్ కూడా అంతంతమాత్రంగానే అనిపించింది. బాడీ లాంగ్వేజ్ కూడా మెరుగ్గా లేదు. మొత్తం మీద ఈ మ్యాచ్​ చాలా నిరాశపరిచింది. ఏది ఏమైనప్పటికీ, పాకిస్థాన్​ జట్టు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకనైనా పట్టు బిగించి మిగిలిన ఆరు మ్యాచ్‌లను మరింత ఆత్మవిశ్వాసంతో ఆడాలి. బెటర్​ లక్​ నెక్స్ట్​ టైమ్​ " అని ముష్తాక్ అన్నారు.

ODI World Cup 2023 IND VS PAK : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. ఇందులో పాకిస్థాన్​పై టీమ్​ఇండియా మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్​తో తలపడిన ఏడుసార్లు విజయం సాధించిన భారత జట్టు.. ఎనిమిది మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డు మరింత పదిలం చేసుకుంది. ఆల్​రౌండ్​ షోతో సూపర్​ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. 30.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడాడు. 63 బంతుల్లో 6 సిక్స్​లు, 6 ఫోర్ల సాయంతో 86 పరుగులు ధనాధన్​ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్(11), కోహ్లీ(18) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కేఎల్‌ రాహుల్‌ (19) రాణించాడు. శ్రేయస్​ అయ్యర్​(53*)హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Wasim Akram on Babar : 'కోహ్లీ జెర్సీలు అక్కడే తీసుకోవాలా?'​.. బాబర్​పై అక్రమ్​ ఫైర్​

Ind vs Pak World Cup 2023 : టీమ్ఇండియా ఫ్యాన్స్​పై పాక్​ బోర్డు గుస్సా.. ఐసీసీకి ఫిర్యాదు?

Last Updated : Oct 18, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.