Ind vs Nz World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్టోబర్ 22 ఆదివారం మెగాటోర్నీలో భాగంగా ధర్శశాల వేదికగా జరిగిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో.. టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి.. మరో 12 బంతులుండగానే ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (95) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (46) రవీంద్ర జడేజా (39) శ్రేయస్ అయ్యర్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు వికెట్లతో రాణించిన భారత బౌలర్ మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
-
India 🇮🇳 make it FIVE in a row!
— BCCI (@BCCI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Ravindra Jadeja with the winning runs 🔥🔥
King Kohli 👑 reigns supreme in yet another run-chase for #TeamIndia 😎#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
">India 🇮🇳 make it FIVE in a row!
— BCCI (@BCCI) October 22, 2023
Ravindra Jadeja with the winning runs 🔥🔥
King Kohli 👑 reigns supreme in yet another run-chase for #TeamIndia 😎#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSraIndia 🇮🇳 make it FIVE in a row!
— BCCI (@BCCI) October 22, 2023
Ravindra Jadeja with the winning runs 🔥🔥
King Kohli 👑 reigns supreme in yet another run-chase for #TeamIndia 😎#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
ఆరంభం అదుర్స్.. 274 పరుగుల లక్ష్య ఛేదనను టీమ్ఇండియా ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46 పరుగులు: 40 బంతుల్లో, 4x4, 4x6) జెట్ స్పాడ్తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మరోవైపు అతడికి శుభ్‌మన్ గిల్ (26 పరుగులు: 31 బంతుల్లో, 5x4) నుంచి కూడా కొంత సహకారం లభించింది. రోహిత్ శర్మ.. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు సాధించిన 46 పరుగుల్లో 40 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే. కానీ, ఫెర్గ్యూసన్ వేసిన బంతి.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను తాకింది. దీంతో 71 పరుగుల వద్ద టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఔటైన తర్వాత గిల్ కూడా తొందరగానే క్రీజును వీడాడు.
రాణించిన మిడిలార్డర్.. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను బ్యాటర్లు విరాట్, అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 52 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. వేగంగా ఆడే క్రమంలో 21.3 ఓవర్ వద్ద అయ్యర్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా కాసేపు నిలకడగా ఆడాడు. అతడు కూడా విరాట్‌తో కలిసి 52 భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ శాంట్నర్ వేసిన బంతిని అంచనా వేయలేక రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది.
రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2).. విరాట్‌తో సమన్వయం కోల్పోయి రనౌటయ్యాడు. దీంతో భారత్ 191 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజా.. కివీస్ బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ టీమ్ఇండియాను విజయం వైపు నడిపించారు. భారత్ విజయం దాదాపు ఖరారైన సమయంలో విరాట్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ, భారీ షాట్‌కు ప్రయత్నించి 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక మిగిలిన పనిని జడేజా పూర్తి చేసి.. టీమ్ఇండియాకు విజయం కట్టబెట్టాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓవర్లన్నీ ఆడి 273 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డ్యారీ మిచెల్ (130 పరుగులు) సూపర్ సెంచరీకితోడు.. రాచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4, కుల్దీప్ యాదవ్ 2, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బూమ్రా తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రత్యక్షంగా వీక్షించారు. "ఈరోజు టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. వారికి శుభాకాంక్షలు" అని మ్యాచ్ అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో అన్నారు.
-
#WATCH | ICC World Cup | Himachal Pradesh: India defeated New Zealand by 4 wickets in the match played at Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala.
— ANI (@ANI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Union Sports Minister Anurag Thakur says, "It was an amazing match played by team India today... Congratulations to… pic.twitter.com/E1yRqdGE3G
">#WATCH | ICC World Cup | Himachal Pradesh: India defeated New Zealand by 4 wickets in the match played at Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala.
— ANI (@ANI) October 22, 2023
Union Sports Minister Anurag Thakur says, "It was an amazing match played by team India today... Congratulations to… pic.twitter.com/E1yRqdGE3G#WATCH | ICC World Cup | Himachal Pradesh: India defeated New Zealand by 4 wickets in the match played at Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala.
— ANI (@ANI) October 22, 2023
Union Sports Minister Anurag Thakur says, "It was an amazing match played by team India today... Congratulations to… pic.twitter.com/E1yRqdGE3G
- " class="align-text-top noRightClick twitterSection" data="updated embed link------------------------------ ">updated embed link------------------------------
Ind vs Nz World Cup 2023 : గిల్, షమీ అరుదైన రికార్డులు.. తొలి బ్యాటర్‌గా శుభ్‌మన్ ఘనత
Jadeja Drop Catch : 'ఏంటీ జడ్డూ.. నువ్వేనా క్యాచ్ మిస్ చేసింది'