ETV Bharat / sports

న్యూజిలాండ్​తో భారత్​ రెండో వార్మప్​ మ్యాచ్​ రద్దు.. కారణమిదే - teamindia vs newzealand match

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన భారత్‌ రెండో వార్మప్‌ మ్యాచ్ రద్దైంది. ఎందుకంటే..

IND VS NZ third warm up match cancelled
న్యూజిలాండ్​తో భారత్​ రెండో వార్మప్​ మ్యాచ్​ రద్దు
author img

By

Published : Oct 19, 2022, 3:26 PM IST

భారత్‌ రెండో వార్మప్‌ మ్యాచ్ రద్దైంది. బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు ఇదే మైదానంలో పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా రద్దైన విషయం తెలిసిందే. అఫ్గాన్‌ ఇన్నింగ్స్ పూర్తి కాగా.. పాక్‌ లక్ష్య ఛేదన చేస్తున్న క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. ఇప్పటికీ వర్షం తగ్గకపోవడంతో భారత్‌-కివీస్‌ మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దు కావడం గమనార్హం.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత షమీ బౌలింగ్‌కు వచ్చి చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో మ్యాచ్‌లోనైనా ప్రాక్టీస్‌ లభిస్తుందని భావించినా వర్షం అడ్డంకిగా మారింది. అంతేకాకుండా తుది జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకొనేందుకు ఉన్న చివరి అవకాశం చేజారింది. దీంతో అక్టోబర్ 23న (ఆదివారం) పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ పోరున టీమ్‌ఇండియా ప్రారంభించనుంది.

ఇదీచూడండి: T20 worldcup: భారత్ ప్రదర్శనపై కపిల్​దేవ్​ కీలక వ్యాఖ్యలు​.. ఏమన్నాడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.