ETV Bharat / sports

Ind Vs Nz: మూడో టీ20లో భారత్​ ఘన విజయం.. సిరీస్​ మనదే - శుభమన్​ గిల్​ న్యూజిలాండ్​ సిరీస్ సెంచరీ

Ind Vs Nz Third T20 Team India Won The Match And Series
Ind Vs Nz: మూడో టీ20లో భారత్​ ఘన విజయం.. సిరీస్​ మనదే
author img

By

Published : Feb 1, 2023, 10:13 PM IST

Updated : Feb 1, 2023, 10:50 PM IST

22:08 February 01

Ind Vs Nz Third T20 Team India Won The Match And Series

న్యుజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలో భారత్​ బౌలర్లు విజృంభించారు. 168 పరుగులు భారీ తేడాతో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. 2-1 ఆధిక్యంతో సిరీస్​ కూడా కైవసం చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్​కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లు హార్దిక్​ (4/16), అర్షదీప్‌ సింగ్‌ (2/16), శివమ్‌ మావీ (2/12), ఉమ్రాన్‌ మాలిక్‌ (2/9) చెలరేగిపోవడంతో 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది కివీస్​. డారిల్‌ మిచెల్‌ (35), మిచెల్‌ సాంట్నర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 126*; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ తోడవ్వడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.రాహుల్‌ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్య కుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. ఇషాన్‌ కిషన్‌ (1) ఒక్కడే నిరాశపరిచాడు. ఇక కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్‌, టిక్నర్‌, సోధీ, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన కివీస్‌.. వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ కోల్పోయింది. ఇక ఇదే పర్యటనలో కివీస్‌.. భారత్​ చేతిలో వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో ఓడిపోయింది. కాగా, టీమ్​ఇండియా తర్వాత .. ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.

అతిపెద్ద విజయం.. టీ20ల్లో పరుగుల పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై టీమ్ఇండియా 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చూడండి: రాహుల్​ మెరుపు ఇన్నింగ్స్​.. ఇషాన్ ఇక​ నువ్వు మారవా?

Last Updated : Feb 1, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.