ETV Bharat / sports

IND vs NZ Test: డ్రాగా ముగిసిన భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు

భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలతో ఆడటం వల్ల భారత బౌలర్లు ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు.

IND vs NZ
IND vs NZ
author img

By

Published : Nov 29, 2021, 4:25 PM IST

కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

రెండో ఇన్నింగ్స్​లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది. ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్​కు శుభారంభమే దక్కింది. లాథమ్, సోమర్​విల్లే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లాథమ్​ (52)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఇక నైట్ వాచ్​మెన్​గా వచ్చిన సోమర్​విల్లే (36)ను ఉమేశ్​ పెవిలియన్ చేర్చాడు. తర్వాత టేలర్ (2), నికోలస్ (1), విలియమ్సన్ (24) వెంటవెంటనే ఔట్ కావడం వల్ల భారత శిబిరంలో విజయావకాశాలపై ఆశలు చిగురించాయి. కానీ చివర్లో రచిన్ రవీంద్ర, జేమిసన్​ భారత బౌలర్లపై ఆధిపత్యం వహించారు. పరుగులు సాధించలేకపోయినా డిఫెన్స్​తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.

ఆఖర్లో ఉత్కంఠ

ఎంతో ఓపికతో ఆడిన జేమిసన్​ (5)ను జడేజా ఔట్ చేయడం వల్ల మరోసారి భారత అభిమానులు సంబరాలు చేసుకున్నారు. విజయం ఖాయమన్న నిశ్చయానికి వచ్చారు. ఆట చివరి గంటకు చేరింది. భారత్​కు విజయం దక్కాలంటే మరో రెండు వికెట్లు కావాలి. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాసేపటికి సౌథీ (4)ని పెవిలియన్ చేర్చి భారత్​ను గెలుపు తీరానికి మరింత దగ్గర చేశాడు జడ్డూ. కానీ చివర్లో రవీంద్ర (18*), అజాజ్ (2*) చివరి వికెట్ పడకుండా అడ్డుకుని మ్యాచ్​ను డ్రాగా ముగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.