ETV Bharat / sports

వాంఖడే క్యూరేటర్​కు టీమ్ఇండియా నగదు ప్రోత్సాహం

Team India Wankhede Curator: వాంఖడే వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. అనంతరం ఈ పిచ్ క్యూరేటర్​కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసి మంచి మనసు చాటుకుంది భారత జట్టు యాజమాన్యం.

Team India latest news, Team India wankhade curator, టీమ్ఇండియా న్యూస్, టీమ్ఇండియా వాంఖడే క్యూరేటర్
Team India
author img

By

Published : Dec 7, 2021, 11:57 AM IST

Team India Wankhede Curator: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన అనంతరం జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు రూ.35 వేల నగదు బహుమతి అందజేసింది. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సొంతంగా అక్కడి క్యూరేటర్‌కు ఇదే విధంగా నగదు బహుమతి అందజేసి అందరి మన్ననలు పొందాడు. తాజాగా భారత్‌ రెండో టెస్టులో పరుగుల పరంగా (372) అత్యంత భారీ విజయం అందుకున్న నేపథ్యంలో ఈ ప్రోత్సాహక బహుమతి అందజేసింది.

సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే భారత జట్టు న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లు పడగొట్టి 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నంబర్‌ 1 స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ న్యూజిలాండ్ జట్టును వెనక్కి నెట్టింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా కివీస్‌ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆపై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు వరుసగా ఉన్నాయి.

ఇవీ చూడండి: Ashesh 2021: ఇంగ్లాండ్​కు షాక్.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.