ETV Bharat / sports

IND VS NZ TEST: కివీస్​ 296 ఆలౌట్.. భారత్​ 14/1 - భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్ అప్​డేట్స్

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు ఆలౌటైంది న్యూజిలాండ్. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు.

IND vs NZ Test live updates, IND vs NZ Test live score, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్ స్కోర్, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు లైవ్ అప్​డేట్స్
IND vs NZ Test
author img

By

Published : Nov 27, 2021, 4:02 PM IST

Updated : Nov 27, 2021, 4:36 PM IST

భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్​లో భారత్​కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డివిరిచాడు స్పిన్నర్ అక్షర్ పటేల్.

ఓవర్​నైట్ స్కోర్ 129 వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్​ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు భారత బౌలర్లపై ఆధిపత్యం వహించి దీటుగా పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్​ (89)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ లాథమ్​ (95)ను బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్. అనంతరం ఏ ఒక్క కివీస్ బ్యాట్స్​మెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (18), టేలర్ (11), జేమిసన్ (23), నికోలస్ (2), బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు పరిమితమై 49 పరుగుల ఆధిక్యాన్ని భారత్​కు అప్పగించింది కివీస్.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో కివీస్​ నడ్డివిరవగా.. అశ్విన్ 3, జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. ​

మూడు రోజు ఆట పూర్తి

వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట త్వరగానే ముగిసిపోయింది. ఈ సమయానికి టీమ్ఇండియా ఒక వికెట్ నష్టపోయి 14 పరుగులు చేసింది. గిల్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరగా.. పుజారా (9*), మయాంక్ (4*)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కివీస్​పై 63 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా.

ఇవీ చూడండి: PBKS IPL 2022: రాహుల్ ఎఫెక్ట్.. ఒక్కరూ వద్దంటున్న పంజాబ్!

Last Updated : Nov 27, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.