ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది టీమ్ఇండియా. 73పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. విజయంలో రోహిత్‌శర్మ(56) హాఫ్ సెంచరీ, బౌలర్ అక్సర్ పటేల్ 3 వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించగా మిగతా ఆటగాళ్లందరూ బాగానే రాణించారు.
లక్ష్య ఛేదనలో కివీస్ 111 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (51) అర్ధ శతకం సాధించినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మిగతా కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (17), ఫెర్గూసన్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/9) అదరగొట్టేశాడు. హర్షల్ పటేల్ (2/24), చాహల్ (1/26), వెంకటేశ్ అయ్యర్ (1/12), దీపక్ చాహర్ (1/26) రాణించారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56) ఈ సిరీస్‌లో వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (29) ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (69) భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఇషాన్‌తోపాటు సూర్యకుమార్ (0), రిషభ్ పంత్ (4) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడం వల్ల స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో(25) కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో 26వ అర్ధశతకం సాధించాడు.
రోహిత్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెంకటేశ్ అయ్యర్ (20) వేగంగా పరుగులు చేశాడు. అయితే శ్రేయస్, వెంకటేశ్ వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21*)ధాటిగా ఆడాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: Ind vs NZ: దంచికొట్టిన రోహిత్.. కివీస్ లక్ష్యం 185