ETV Bharat / sports

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు కెప్టెన్​గా రాహుల్! - కేఎల్ రాహుల్ కెప్టెన్​

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్​తో టీ20(ind vs nz series 2021), టెస్టు, వన్డే సిరీస్ ఆడనుంది భారత్. కాగా, రాహుల్​(kl rahul news)ను కివీస్​తో పొట్టి సిరీస్​కు కెప్టెన్​గా నియమించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Rahul
రాహుల్
author img

By

Published : Nov 2, 2021, 1:05 PM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ముగిశాక న్యూజిలాండ్​(ind vs nz series 2021)తో పరిమిత ఓవర్ల సిరీస్​లో తలపడనుంది టీమ్ఇండియా. మెగాటోర్నీలో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న భారత జట్టులోని కొంతమంది సీనియర్లు ఈ సిరీస్​కు విశ్రాంతి తీసుకోనున్నారట. ఈ నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్​కు కేఎల్ రాహుల్(kl rahul news)ను కెప్టెన్​గా నియమించనున్నారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే ఈ మ్యాచ్​ల కోసం అభిమానుల్ని మైదానాలకు అనుమతిస్తామని వెల్లడించారు.

"సీనియర్లకు కాస్త విరామం అవసరం. రాహుల్​ జట్టులో కీలక సభ్యుడు. టీ20 సిరీస్​కు అతడు సారథ్యం వహించే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్​లు చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తాం. పూర్తి సామర్థ్యంతో కాకపోయినా.. కరోనా నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై బోర్డు మీటింగ్​లో చర్చిస్తాం. ఇందుకోసం రాష్ట్ర క్రీడా బోర్డులతో మాట్లాడుతున్నాం."

-బీసీసీఐ అధికారి

టీ20 ప్రపంచకప్ తర్వాత తన టీ20 కెప్టెన్సీ(virat kohli t20 captaincy)కి రాజీనామా చేస్తానని తెలిపాడు విరాట్ కోహ్లీ(virat kohli news). దీంతో తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. కొద్దిరోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్​గా ఉన్న రోహిత్​.. టీ20 పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. రాహుల్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇంగ్లాండ్​ పర్యటన నుంచి వరుసగా టోర్నీలు ఆడుతున్న కోహ్లీ, రోహిత్​తో పాటు పలువురు సీనియర్లు న్యూజిలాండ్​తో సిరీస్​కు విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం. దీంతో రాహుల్​కు పగ్గాలు అప్పజెప్పనున్నారు.

షెడ్యూల్ ఇదే!

టీ20 ప్రపంచకప్(t20 wrld cup 2021) ముగిశాక న్యూజిలాండ్​తో టీ20 సిరీస్(ind vs nz series 2021) జరగనుంది. మొదటి టీ20 నవంబర్ 17న జైపుర్ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత 19న రాంచీ, 21న కోల్​కతా వేదికలుగా మిగతా రెండు టీ20లు నిర్వహిస్తారు. అనంతరం 25న టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.

ఇవీ చూడండి: 'అశ్విన్​ను తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.