న్యూజిలాండ్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) డబుల్ సెంచరీతో చెలరేగాడు. 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. 87 బంతుల్లో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. ఓ దశలో 137 బంతుల్లో 169 పరుగులతో నిలిచాడు. దాంతో డబుల్ సెంచరీ చేస్తాడని ఎవరూ కూడా ఊహించలేదు.
కానీ తాను ఆడిన చివరి 8 బంతుల్లో 6,0,6,0,1,6,6,6తో 31 పరుగులు చేసి కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఇక ద్విశతకం సాధించిన అనంతరం శుభ్‌మన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కసారిగా తాను పడిన కష్టాలను శుభ్‌మన్ గుర్తు చేసుకున్నట్లున్నాడు. గట్టిగా అరుస్తూ.. తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. శుభ్‌మన్ సంబరాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
-
The moment Shubman Gill has completed his Double hundred - What a player.
— CricketMAN2 (@ImTanujSingh) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Take a bow, Shubman! pic.twitter.com/okMFmHcDlx
">The moment Shubman Gill has completed his Double hundred - What a player.
— CricketMAN2 (@ImTanujSingh) January 18, 2023
Take a bow, Shubman! pic.twitter.com/okMFmHcDlxThe moment Shubman Gill has completed his Double hundred - What a player.
— CricketMAN2 (@ImTanujSingh) January 18, 2023
Take a bow, Shubman! pic.twitter.com/okMFmHcDlx
భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. డబుల్ సెంచరీ జాబితాలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తర్వాత డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇందులో రోహిత్ ఒక్కడే మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఇక భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా శుభ్‌మన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ రికార్డును అధిగమించాడు.
24 ఏళ్ల 145 రోజుల వయసుతో ఇషాన్ కిషన్ డబుల్ బాదగా.. 23 ఏళ్ల 132 రోజుల వయసుతో శుభ్‌మన్ గిల్ అధిగమించాడు. 23 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా.. అత్యంత వేగంగా మూడు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా శుభ్‌మన్ నిలిచాడు. శుభ్‌మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్క్‌నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.