ETV Bharat / sports

షమీ @ 7 - కివీస్​ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్​కు భారత్ - world cup 2023 first semis result

Ind vs Nz Semi Final 2023 : 2023 ప్రపంచకప్​లో భారత్ ఫైనల్స్​లో అడుగుపెట్టింది. ముంబయి వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ind vs nz semi final 2023
ind vs nz semi final 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 10:32 PM IST

Updated : Nov 15, 2023, 10:53 PM IST

Ind vs Nz Semi Final 2023 : 2023 వరల్డ్​కప్​లో భారత్ ఫైనల్​కు దూసుకెళ్లింది. తొలి సెమీస్​లో న్యూజిలాండ్​పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్.. 48.5 ఓవర్లలో 327 పరుగులకు చేతులెత్తేసింది. డారిల్ మిచెల్ (138 పరుగులు), కెప్టెన్ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్​ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి 7, జస్​ప్రీత్ బుమ్రా, కుల్​దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించిన మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్​కు చేరింది.

భారీ లక్ష్యాన్ని కివీస్ ముంగిట ఉంచగానే.. ప్రత్యర్థి ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారు టీమ్ఇండియా ఫ్యాన్స్. కానీ, జరిగింది వేరు. కివీస్ ఇన్నింగ్స్​లో ఓపెనర్లు డేవన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13) త్వరగానే ఔటనప్పటికీ.. డారిల్ మిచెల్, విలియమ్సన్ పట్టవదలకుండా పోరాడారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు.. టీమ్ఇండియా ఆటగాళ్లతోపాటు, ఫ్యాన్స్​ మొహంలో నవ్వు లేదు. వీరిద్దరూ టీమ్ఇండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బౌండరీలే లక్ష్యంగా ఆడారు. ఒక దశలో భారత్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేశారు. 3 వికెట్​కు వీరు 181 పరుగులు జోడించారు.

షమీ షో.. టీమ్ఇండియా బౌలింగ్​లో షమీ హీరోగా నిలిచాడు. ఓకే ఓవర్లో విలియమ్సన్​, టామ్ లాథమ్ (0) వికెట్ తీసి భారత్​ను మళ్లీ గేమ్​లోకి తీసుకొచ్చాడు. తర్వాత ఫిలిప్స్ కాసేపు పోరాడినా.. అతడ్ని బుమ్రా వెనక్కిపంపాడు. ఆ తర్వాత కివీస్ టపటపా వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (47), శుభ్​మన్ గిల్ (80*), విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (102), కేఎల్ రాహుల్ (39) అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కింది.

'నువ్వు నా హృదయాన్ని తాకావ్​'- విరాట్​పై సచిన్​ అభినందనల వెల్లువ

సెంచరీలతో చెలరేగిన విరాట్, అయ్యర్ - కివీస్ ముందు భారీ లక్ష్యం

Last Updated : Nov 15, 2023, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.