రెండో వన్డేలో టీమ్ ఇండియా బౌలర్ల విజృంభించారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వకుండా దెబ్బతీశారు. దీంతో కివీస్ జట్టు 34.3 ఓవర్లలోనే 108 పరుగులకు కుప్పకూలింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్‌లో మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్దిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) చెలరేగడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ జట్టు ఆలౌట్ అయింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొదట 14 ఓవర్లలో 18 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయాయి. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రాస్ వెల్ ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తాడనుకున్నప్పటికీ.. అతడిని షమీ బోల్తా కొట్టించాడు.
ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ 3, సుందర్, హార్దిక్ తలో రెండు, సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: IND vs NZ: రోహిత్‌కు వింత అనుభవం.. పీకల్లోతు కష్టాల్లో కివీస్