మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా జనవరి 27న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమై టీమ్ఇండియా ప్లేయర్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. టీమ్ ప్లేయర్స్‌లో జోష్ నింపాడు. అతడు మరెవరో కాదు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.
టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యక్షమైన ధోనీని చూసి యువ భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ధోనితో సరదాగా గడుపుతూ కాసేపు సందడి చేశారు. మహీ కూడా హుషారుగా ప్లేయర్స్‌కు సలహాలు ఇస్తూ సరదాగా గడిపాడు. వీరిలో హార్దిక్, ఇషాన్, గిల్, సూర్యకుమార్, చాహల్, సుందర్ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
-
Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
రాంచీకి చేరుకున్న తర్వాత ఆటగాళ్లు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్.. తన జెర్సీ నెంబర్ వెనుక రహస్యం సహా తనకిష్టమైన వంటకాలు, ధోనీతో అనుబంధం గురించి మాట్లాడాడు.
ఆమె చెప్పిందనే.. "నా జెర్సీ నంబర్ 23 ఉండాలని కోరుకున్నా. కానీ అప్పటికే కుల్దీప్ యాదవ్ అదే నంబర్‌ను ఎంపిక చేసుకున్నాడు. దీంతో నేను మరో ఆప్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి.. తన అభిప్రాయం అడిగాను. 32 నంబర్ ఉంటే తీసుకోమని చెప్పింది. అందుకు గల కారణాన్ని నేను అడగాలనుకోలేదు. ఆమె చెప్పిందనే జెర్సీ నంబర్ 32ను ఎంచుకున్నా" అని ఇషాన్ పేర్కొన్నాడు.
అన్నీ జరిగాయి.. "14 ఏళ్ల వయసులో.. బిహార్ నుంచి ఝార్ఖాండ్‌కు మా కుటుంబం షిఫ్ట్ అయినపుడే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలని నిర్ణయించుకున్నా. తొలుత అండర్ 19.. ఆ తర్వాత టీమ్ఇండియాకు ఆడాలనేదే నా కోరిక. ఈ సుదీర్ఘ ప్రయాణలో ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి." అని ఇషాన్ హర్షం వ్యక్తం చేశాడు.
అవే గొప్ప క్షణాలు.. "నా 18 ఏళ్ల వయసులో తొలిసారి ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నా. మహీని నేరుగా కలిసిన క్షణాలు నా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. నాది కష్టాలకు భయపడే తత్వం కాదు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే నాకిష్టం. ఇక నాకు జపనీస్ వంటకాలంటే ఇష్టం. రోజూ వాటినే పెట్టినా హాయిగా తినేస్తా." అని చెప్పుకొచ్చాడు.
-
Secret behind jersey number 🤔
— BCCI (@BCCI) January 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Getting the legendary @msdhoni's autograph ✍️
Favourite cuisine 🍱
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiI
">Secret behind jersey number 🤔
— BCCI (@BCCI) January 26, 2023
Getting the legendary @msdhoni's autograph ✍️
Favourite cuisine 🍱
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiISecret behind jersey number 🤔
— BCCI (@BCCI) January 26, 2023
Getting the legendary @msdhoni's autograph ✍️
Favourite cuisine 🍱
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiI
ఇదీ చూడండి: ఐపీఎల్ 2023లో ధోనీ.. హార్దిక్‌తో కలిసి 'షోలే 2'.. సోషల్‌మీడియాలో లైకులే లైకులు..