IND vs NZ Test Toss: తొలి టెస్టులో విజయాన్ని కొద్దిలో మిస్సయిన భారత జట్టు న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. టీ20 ప్రపంచకప్ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యచ్‌లో ఆడనున్నాడు. విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని చూస్తోంది.
టాస్ ఆలస్యం
రెండు రోజులుగా ముంబయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాంఖడే మైదానం చిత్తడిగా మారింది. నేడు (శుక్రవారం) వర్షం లేకపోయినా.. పిచ్, ఔట్‌ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో టాస్ ఆలస్యం కానున్నట్లు తెలిపారు అంపైర్లు. 10.30 గంటలకు మరోసారి పిచ్‌ను పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.