ETV Bharat / sports

భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిల.. 62 పరుగులకే ఆలౌట్ - భారత్ X న్యూజిలాండ్ కివీస్ బ్యాటింగ్

IND vs NZ 2nd Test: భారత్​తో రెండో టెస్టులో కివీస్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్​లో 62 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 4 వికెట్లు తీశాడు.

ind vs nz
న్యూజిలాండ్X భారత్
author img

By

Published : Dec 4, 2021, 3:43 PM IST

IND vs NZ 2nd Test: రెండో టెస్టు రెండో రోజు టీమ్​ఇండియా బౌలర్ల ధాటికి కివీస్​ విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్​లో 62 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఇన్నింగ్స్​ ప్రారంభంలో విల్ యంగ్(4), టామ్ లాథమ్(10)ను పెవిలియన్​కు పంపాడు భారత జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్. దీంతో కివీస్​ జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు.

మిచెల్(8), రాస్ టేలర్(1), హెన్రీ నికోలస్(7), రచిన్ రవీంద్ర(4) కూడా క్రీజులో నిలువలేకపోయారు. దీంతో కివీస్​ 62 పరుగులకే ఆలౌటైంది.

మయాంక్​ సూపర్​ ఇన్నింగ్స్​తో..

అంతకు ముందు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. టీమ్​ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) సూపర్​ ఇన్నింగ్స్​ ఆడగా.. అక్షర్ పటేల్(52) రాణించాడు. పుజారా, కోహ్లీ, అశ్విన్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ చేరారు.

Ajaz Patel Record: ఈ మ్యాచ్​లో 10 వికెట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.

ఇదీ చదవండి:

IND vs NZ Test: చరిత్ర సృష్టించిన అజాజ్​.. భారత్​ 325 ఆలౌట్​

IND vs NZ 2021: అశ్విన్ పొరపాటు.. మయాంక్ సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.