ETV Bharat / sports

IND VS NZ: రోహిత్​ 10 ఏళ్లు.. సచిన్‌ రికార్డుపై కోహ్లీ కన్ను

మరి కాసేపట్లో న్యూజిలాండ్​తో మూడో వన్డే ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్​తో కెప్టెన్​ కోహ్లీ, రోహిత్​ అరుదైన ఘనతలను అందుకోనున్నారు. అవేంటంటే..

IND VS Nezealand third ODI Rohith 10 Years and Kohli sachin record
IND VS NZ: రోహిత్​ 10 ఏళ్లు.. సచిన్‌ రికార్డుపై కోహ్లీ
author img

By

Published : Jan 24, 2023, 12:13 PM IST

మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమ్​ఇండియా.. ఇక చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని ఎదురు చూస్తోంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో అదరగొట్టి.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌కు చుక్కులు చూపించింది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధిస్తే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న భారత్​.. అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్​తో కెప్టెన్​ కోహ్లీ, రోహిత్​ అరుదైన ఘనతలను అందుకోనున్నారు.

  • ఓపెనర్‌గా రోహిత్ 10 ఏళ్లను పూర్తి చేసుకోనున్నాడు.
  • అదే విధంగా వన్డేల్లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ జట్టును క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం భారత్‌కు వచ్చింది.
  • ఇక కోహ్లీ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. అయితే అది క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ రికార్డు కావడం విశేషం.
  • ఈ మ్యాచ్‌లో విరాట్​ హాఫ్​ సెంచరీ సాధిస్తే.. న్యూజిలాండ్‌పై ఎక్కువ హాఫ్‌ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
  • ప్రస్తుతం విరాట్, సచిన్‌ పదమూడేసి అర్ధశతకాలతో ఉన్నారు. సెంచరీ సాధిస్తే మాత్రం కివీస్‌పై ఎక్కువ శతకాలు సాధించిన బ్యాటర్‌గానూ వీరేంద్ర సెహ్వాగ్‌ (6)తో సమంగా విరాట్ కోహ్లీ (5) నిలుస్తాడు.

తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, ఉమ్రాన్ మాలిక్‌, చాహల్‌

ఇదీ చూడండి: షమీకి షాక్​.. భార్యకు భరణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం.. ప్రతినెల ఎన్ని లక్షలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.