ETV Bharat / sports

శతక్కొట్టిన పంత్.. ధోనీ రికార్డు బద్దలు.. జట్టుకు ఆపద్బాంధవుడిగా.. - ఇంగ్లాండ్​ భారత్​ టెస్ట్​ పంత్​ ఇన్నింగ్స్​

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకెళ్తోంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్​ఇండియాను.. రిషబ్​ పంత్(146)అదిరిపోయే ఆటతీరుతో ఆదుకున్నాడు. అద్భుతమైన సెంచరీతో కదం తొక్కి అభిమానుల్లో ఆశలు చిగురించాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టీమ్​ఇండియాను ఆదుకున్న రిషబ్​​ పంత్‌ అత్యంత వేగంగా టెస్టు శతకం సాధించిన భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. బ్యాట్‌ ఝుళిపిస్తూ స్వేచ్ఛగా పరుగులు రాబట్టి జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.

IND Vs ENG Test Match
IND Vs ENG Test Match
author img

By

Published : Jul 2, 2022, 7:07 AM IST

Updated : Jul 2, 2022, 8:14 AM IST

  • ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యం సాధించడమంటే అరుదైన విషయమే. అదే ఊపులో చివరి టెస్టు కూడా ఆడి ఉంటే సులువుగా సిరీస్‌ గెలిచేసేవారేమో!
  • కానీ తొమ్మిది నెలల విరామం తర్వాత ఇప్పుడు ఆ మిగిలిన చివరి టెస్టు ఆడబోతుండగా.. రెండు జట్లలో ఎంతో వైరుధ్యం! ఫామ్‌ పరంగా కూడా చాలా తేడా! అంతా బేరీజు వేసుకుని చూస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు కష్టమే అన్న అంచనాలు!
  • అందుకు తగ్గట్లే మొదలైంది మ్యాచ్‌. మబ్బులు కమ్మిన వాతావరణంలో చెలరేగిన ఇంగ్లిష్‌ పేసర్ల ధాటికి ఒక దశలో భారత్‌ 98/5. ఈ స్కోరు చూస్తే మ్యాచ్‌ మీద ఆశలు పోయినట్లే అనిపించింది.
  • కానీ ఇలాంటి సందర్భాల్లో ఆపద్బాంధవుడి పాత్ర పోషించడం అలవాటుగా చేసుకున్న రిషబ్‌ పంత్‌ వదిలితేనా..! రవీంద్ర జడేజా నుంచి చక్కటి సహకారం అందుకున్న ఈ మెరుపు వీరుడు భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆట ఆఖరుకు స్కోరు 338/7.

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించిన భారత్‌.. రిషబ్‌ పంత్‌ (146; 111 బంతుల్లో 19×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో గొప్పగా పుంజుకుంది. తొలి రోజు ఆట ఆఖరుకు 73 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌; 163 బంతుల్లో 10×4)తో ఆరో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన పంత్‌ మ్యాచ్‌లో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. అంతకుముందు జేమ్స్‌ అండర్సన్‌ (3/52), మాథ్యూ పాట్స్‌ (2/85) టీమ్‌ఇండియాను ఆరంభంలో గట్టి దెబ్బ తీశారు. అయిదు టెస్టుల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ అయ్యేసరికి భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలవగా, కొవిడ్‌ కారణంగా వాయిదా పడ్డ అయిదో టెస్టునే భారత్‌ ఇప్పుడు ఆడుతున్న సంగతి తెలిసిందే.

అలా మొదలై.. పేసర్లకు ఉత్సాహాన్నిచ్చేలా మబ్బులు కమ్మిన వాతావరణం.. ఇలాంటి స్థితిలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అండర్సన్‌, బ్రాడ్‌, పాట్స్‌ లాంటి ఫామ్‌లో ఉన్న పేసర్లకు ఇంతకంటే ఏం కావాలి? ఈ అవకాశాన్ని వాళ్లు చక్కగా ఉపయోగించుకున్నారు. స్లిప్‌లో నలుగురు ఫీల్డర్లను పెట్టి.. ఆఫ్‌ స్టంప్‌ మీదే ఒకే లైన్‌లో బంతులు సంధిస్తూ భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టారు. రోహిత్‌ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన పుజారా (13).. తనదైన శైలిలో పాతుకుపోయే ప్రయత్నం చేయగా, మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (17) జాగ్రత్త వహిస్తూనే అప్పుడప్పుడూ షాట్లు ఆడాడు. అతను నాలుగు చూడముచ్చటైన బౌండరీలు కొట్టి సానుకూల దృక్పథంతో కనిపించాడు. కానీ గిల్‌ ఏకాగ్రత అరగంటే నిలిచింది. అండర్సన్‌ బౌలింగ్‌లో ఒక ఎడ్జ్‌తో త్రుటిలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. ఇంకోసారి రెండో స్లిప్‌లో క్రాలీకి దొరికిపోయాడు. తర్వాత పుజారా, విహారి అత్యంత జాగ్రత్తతో బ్యాటింగ్‌ చేశారు.

డిఫెన్స్​కే ప్రాధాన్యం.. పరుగుల కోసం చూడకుండా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లిష్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అయితే సమీక్ష ద్వారా ఒక క్యాచ్‌ ఔట్‌ను తప్పించుకున్న పుజారా.. అండర్సన్‌ సంధించిన అద్భుతమైన ఔట్‌స్వింగర్‌ను ఆడక తప్పని స్థితిలో రెండో స్లిప్‌లో క్రాలీకే చిక్కాడు. ఈ దశలో వర్షం వల్ల రెండు గంటల పాటు ఆట ఆగిపోయింది. ఆట పునఃప్రారంభం కాగానే భారత్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. విహారి (20)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న పాట్స్‌.. కాసేపటికే ఫామ్‌లో లేని కోహ్లి (11)ని పెవిలియన్‌ చేర్చాడు. పాట్స్‌ బంతిని ఆడాలా వద్దా అన్నట్లు సంశయించిన కోహ్లి.. వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరిగాడు. ఉన్నకాసేపు చక్కటి షాట్లతో అలరించిన శ్రేయస్‌ (15).. లెగ్‌సైడ్‌ వెళ్తున్న అండర్సన్‌ బంతిని ఆడి బిల్లింగ్స్‌ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో 98/5కు చేరుకున్న భారత్‌.. 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది ఆ దశలో.

తన ఆట తనదే.. 100 లోపు 5 వికెట్లు పడితే.. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా ఆచితూచి ఆడతాడు. కానీ పంత్‌ ఇందుకు భిన్నం. ఎవరేమన్నా, విమర్శలు వచ్చినా తన ఆట తనదే. శుక్రవారం కూడా అతను అలాగే ఆడాడు. క్రీజులో కొంచెం కుదురుకోగానే షాట్లకు దిగాడు. అండర్సన్‌ లాంటి మేటి పేసర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్లు ఆడడం, రివర్స్‌ స్వీప్‌ చేయడం అతడికే చెల్లింది. ఇక స్పిన్నర్‌ లీచ్‌ (9-0-71-0) వస్తే అతడికి పండగన్నట్లే. తననో గల్లీ బౌలర్‌లా చూసిన పంత్‌.. టీ20ల తరహాలో అతడి బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. తన మార్కు ఒంటి చేతి సిక్సర్‌ కూడా బాదాడు రిషబ్‌. మరో ఎండ్‌లో జడేజా గొప్ప సహనంతో బ్యాటింగ్‌ చేస్తూ పంత్‌కు చక్కటి సహకారాన్నందించాడు. 5 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్‌ కష్టమైన క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన జడేజా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. పంత్‌ ఎక్కడా తగ్గకుండా పరుగుల వరద పారిస్తుంటే.. జడేజా అప్పుడప్పుడూ షాట్లు అందుకున్నాడు. దీంతో భారత్‌ రన్‌రేట్‌ 4 పైనే సాగింది. ఒక దశలో 5కు చేరువైంది కూడా. సెంచరీ ముంగిట కూడా పంత్‌ నెమ్మదించలేదు. 51 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతను.. 89 బంతులకే 100 అందుకున్నాడు. ఆ మార్కును దాటాక అతను టీ20 ఆటే ఆడాడు. 21 బంతుల్లోనే 146 మీదికి వచ్చేశాడు. అదే ఊపులో రూట్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయిన పంత్‌.. ఎడ్జ్‌తో స్లిప్‌లో క్రాలీ చేతికి చిక్కాడు. కాసేపటికే శార్దూల్‌ (1)ను స్టోక్స్‌ ఔట్‌ చేశాడు. తర్వాత షమి (0)తో కలిసి జడేజా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 17; పుజారా (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 13; విహారి ఎల్బీ (బి) పాట్స్‌ 20; కోహ్లి (బి) పాట్స్‌ 11; పంత్‌ (సి) క్రాలీ (బి) రూట్‌ 146; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) అండర్సన్‌ 15; జడేజా బ్యాటింగ్‌ 83; శార్దూల్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) స్టోక్స్‌ 1; షమి బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం: (73 ఓవర్లలో 7 వికెట్లకు) 338; వికెట్ల పతనం: 1-27, 2-46, 3-64, 4-71, 5-98, 6-320, 7-323; బౌలింగ్‌: అండర్సన్‌ 19-4-52-3; బ్రాడ్‌ 15-2-53-0; పాట్స్‌ 17-1-85-2; లీచ్‌ 9-0-71-0; స్టోక్స్‌ 10-0-34-1; రూట్‌ 3-0-23-1

ధోనీ రికార్డు బద్దలు..

  • ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టీమ్‌ ఇండియాను ఆదుకున్న రిషబ్‌ పంత్‌ అత్యంత వేగంగా టెస్టు శతకం సాధించిన భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. 89 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్న పంత్‌.. ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ధోనీ 2005లో పాకిస్థాన్‌పై 93 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.
  • ఇటీవలే న్యూజిలాండ్‌తో మూడు టెస్టులాడింది ఇంగ్లాండ్‌. ఆ సిరీస్‌ మొత్తంలో నాలుగుసార్లు మిచెల్‌-బ్లండెల్‌ జోడీ బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారైంది. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 236, 195.. అయిదో వికెట్‌కు 120, 113 భాగస్వామ్యాలతో ఇంగ్లాండ్‌కు చెక్‌ పెట్టింది. ఇప్పుడు పంత్‌-జడేజా ఆరో వికెట్‌కు 222 జోడించారు.
  • సెహ్వాగ్‌ (79 బంతుల్లో), అజహరుద్దీన్‌ (88 బంతుల్లో) తర్వాత ఆసియా వెలుపల అత్యంత వేగంగా టెస్టు శతకం సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా పంత్‌ నిలిచాడు.
  • టెస్టుల్లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్నవయసు భారత వికెట్‌కీపర్‌గా పంత్‌ ఘనత సాధించాడు.
  • 5..టెస్టుల్లో పంత్‌ సాధించిన శతకాలు. ఇందులో మూడు ఇంగ్లాండ్‌పై చేసినవే.

అతడే ఆపద్భాందవుడు.. కెరీర్‌ ఆరంభంలో రిషబ్‌ పంత్‌ ఆట చూసి అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే బాగా సరిపోతాడని అంతా అనుకున్నారు. కానీ సెహ్వాగ్‌లా అతను వన్డేలు, టీ20లను మించి టెస్టుల్లో ఎక్కువ విజయవంతం అవుతుండటం, తరచుగా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం విశేషం. విదేశాల్లో కఠిన పిచ్‌లపై ప్రత్యర్థి పేసర్ల ధాటికి తాళలేక టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడి వెనుదిరగడం.. పంత్‌ వచ్చి బ్యాట్‌ ఝుళిపిస్తూ స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం.. జట్టుకు ఆపద్బాంధవుడిగా మారడం.. ఈ దృశ్యాలు తరచుగా చూస్తున్నాం.

ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో గతంలో అతనాడిన మేటి ఇన్నింగ్స్‌ల గురించి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రదర్శనతో మరోసారి పంత్‌ తన విలువను చాటిచెప్పాడు. 71/4తో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి అడుగుపెట్టిన రిషబ్‌.. మ్యాచ్‌ గమనంతో సంబంధం లేకుండా మరోసారి తన సహజ శైలిలో చెలరేగి జట్టును మంచి స్థితికి చేర్చాడు. అతను వచ్చిన కాసేపటికే శ్రేయస్‌ కూడా ఔటవడంతో భారత్‌ 98/5తో మరింత ఇబ్బందుల్లో పడింది. అయినా అతను వెరవలేదు. ఇంగ్లిష్‌ బౌలర్లందరి మీదా ఎదురు దాడి చేశాడు. న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన లీచ్‌నైతే అతను లెక్కే చేయలేదు. అతడిని గల్లీ బౌలర్‌లా మార్చేస్తూ.. పదే పదే ముందుకొచ్చి షాట్లు ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు. కొన్నిసార్లు అవసరం లేని సాహసాలు చేసినట్లు అనిపించినా.. పంత్‌ ఆట మాత్రం అభిమానులను అమితంగా అలరించడమే కాక, భారత జట్టును పెద్ద ప్రమాదం నుంచి బయట పడేసింది. అతనిలా ఆడకుంటే తొలి రోజే మ్యాచ్‌పై భారత్‌ ఆశలు వదులుకోవాల్సి వచ్చేది.

ఇవీ చదవండి: మళ్లీ ప్రత్యర్థిదే పైచేయి.. మలేసియా ఓపెన్​ నుంచి సింధు ఔట్

నాపై ఆ ఒత్తిడి లేదు.. దాని గురించి ఆలోచిస్తే అంతే: నీరజ్ చోప్రా

Last Updated : Jul 2, 2022, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.