ETV Bharat / sports

బ్యాటింగ్​కు దిగిన ఫ్యాన్.. మైదానంలో ఫుల్ కామెడీ! - టీమ్​ఇండియా ఇంగ్లాండ్​ సిరీస్​

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మైదానంలో మళ్లీ నవ్వులు పూశాయి. ఓ ఇంగ్లాండ్​ అభిమాని మరోసారి భారత జెర్సీ ధరించి బ్యాటింగ్​కు దిగబోయాడు. వైరల్​గా మారిన ఈ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది.

jarvo
జార్వో
author img

By

Published : Aug 28, 2021, 5:01 AM IST

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా మూడు రోజు ఆటలో మైదానంలో నవ్వులు పూశాయి. జార్వో అనే ఓ ఇంగ్లాండ్​ అభిమాని మరోసారి భారత జెర్సీ వేసుకుని నెం.4 స్థానంలో బ్యాటింగ్​ చేయడానికి మైదానంలోకి దూసుకొచ్చాడు. సీరియస్​గా సాగుతున్న మ్యాచ్​లో రోహిత్​ శర్మ ఔట్​ అవ్వగానే అతడి ఎంట్రీ.. క్రికెట్​ ఫ్యాన్స్​కు వినోదాన్ని పంచింది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటకి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం అందరి చేత నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ఇటీవల లార్డ్స్​లో జరిగిన రెండో టెస్టులోనూ అతడు నెం.69తో కూడిన భారత జెర్సీ ధరించి మైదానంలో క్రికెటర్ల మధ్య కలిసిపోయి ప్రొఫెషనల్​ ప్లేయర్​ తరహాలో తిరిగాడు. మొదట అతడిని ఎవరూ గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటిలోనే సిబ్బంది గమనించి అతడిని బయటకు బలవంతంగా పంపారు. ఇది చూసిన మన క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు విపరీతంగా నవ్వుకున్నారు.

అయితే జార్వోకు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ పలు సార్లు ఇలానే చేశాడు. ఓ సారి ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​లోనూ మైదానంలోకి వచ్చి టెంట్​ వేసుకుని అందులో నిద్రపోయాడు. ఆ వీడియో వైరల్​ అప్పట్లో అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఇప్పటికీ సుశీల్​ కుమారే ఉత్తమ రెజ్లర్'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.