ETV Bharat / sports

IND vs ENG: రెండో రోజు ముగిసిన ఆట.. 119/3తో ఇంగ్లాండ్

లార్డ్స్​ వేదికగా భారత్​తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్​ జట్టు 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్​ (48*), బెయిర్​ స్టో (6*) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్​ 2, షమీ ఒక్క వికెట్​తో రాణించారు.

IND vs ENG
భారత్ వెస్​ ఇంగ్లాండ్​
author img

By

Published : Aug 13, 2021, 11:05 PM IST

Updated : Aug 13, 2021, 11:54 PM IST

లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జో రూట్​ (48*), బెయిర్​ స్టో (6*) ​నాటౌట్​గా నిలిచారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్​ 2, షమీ ఒక్క వికెట్​తో మెరిశారు.

276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డులో రెండు పరుగులు జత అయ్యాయో లేదో రాహుల్​ వెనుదిరిగాడు. మరో నాలుగు పరుగులకే రహానె కూడా పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత పంత్​-జడేజా జోడీ కాస్త ప్రతిఘటించింది. ఆరో వికెట్​కు ఈ జంట 49 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని మార్క్​ వుడ్​ విడదీశాడు. పంత్​ను కీపర్​ క్యాచ్​గా వెనక్కి పంపాడు.

IND vs ENG
వికెట్ పడ్డ ఆనందంలో టీమ్ఇండియా ఆటగాళ్లు

ఆ తర్వాత వచ్చిన వారెవరూ ధాటిగా ఆడే ప్రయత్నం చేయలేదు. క్రీజులో రవీంద్ర జడేజా ఉన్నా మరో ఎండ్​లో అతడికి సహకారం లభించలేదు. దీంతో ఓ భారీ షాట్​కు ప్రయత్నించి చివరి వికెట్​గా జడేజా పెవిలియన్ చేరాడు. 88 పరుగులకే చివరి 7 వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 5 వికెట్లతో మెరిశాడు. మార్క్​ వుడ్​, రాబిన్సన్​ తలో రెండు వికెట్లతో రాణించారు.

IND vs ENG
రిషభ్ పంత్​తో జడేజా
IND vs ENG
మైదానంలో భారత బృందం

తొలి ఇన్నింగ్స్​ను నెమ్మదిగా మొదలు పెట్టిన రూట్​ సేన. వికెట్లేమీ నష్టపోకుండా టీ విరామానికి వెళ్లింది. తొలి వికెట్​కు 23 పరుగులు జోడించాక.. సిరాజ్​ ఈ జంటను విడదీశాడు. వరుస బంతుల్లో సిబ్లీతో పాటు హసీబ్​ హమీద్​ను పెవిలియన్​ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రూట్​ బర్న్స్​కు సహకరించాడు. ఈ జంట ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది. మూడో వికెట్​కు ఈ ద్వయం 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న బర్న్స్​ను షమీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: T20 World cup: జట్టులో 15 మందికి మాత్రమే.. కానీ!

Last Updated : Aug 13, 2021, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.