టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో రసవత్తరపోరుకు సమయం దగ్గరపడింది. బుధవారం నుంచి ఇరు జట్లూ హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటికే లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో దూసుకుపోవాలని చూస్తోంది. అలాగే ఈ టెస్టులోనైనా కోహ్లీసేననను ఓడించి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది ఇంగ్లాండ్. కాగా, ఈ మ్యాచ్ జరగబోయే లీడ్స్‌లో వాతావరణం, పిచ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
వాతావరణం
లీడ్స్‌లో గాలులు ఎక్కువగా వీస్తాయి. మ్యాచ్ జరిగే ఐదు రోజులు ఇక్కడ 18 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మొదటి నాలుగు రోజులకు వర్ష సూచన లేకపోయినా.. ఐదో రోజూ మాత్రం వరుణుడు మ్యాచ్‌కు అడ్డు తగిలే వీలుంది.
పిచ్
లీడ్స్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. రెండో టెస్టులో చెలరేగిన షమీ, బుమ్రా, సిరాజ్‌లకు ఇది కలిసొచ్చే అంశం. దీంతో మూడో టెస్టులో టీమ్ఇండియా ఒకే స్పిన్నర్‌తో బరిలో దిగే వీలుంది.