Ind Vs Ban World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. పుణె వేదికగా జరగుతున్న ఈ పోరులో టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. నిర్దిష్ట ఓవర్లకు 256 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా, సిరాజ్ లాంటి బౌలర్లు తమ ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా బంతులను సంధించి బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లా బ్యాటర్లలో తాంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు.
Virat Kohli Bowling : ఇక ఇదే మ్యాచ్ వేదికగా టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బౌలర్ అవతారమెత్తాడు. అయితే, కేవలం మూడు బంతులను మాత్రమే విసిరాడు. ఇన్నింగ్స్‌లోని 9వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తీసుకున్నా సరే బౌలింగ్ వేయడానికి అతడు ఇబ్బంది పడ్డాడు. మోకాలి నొప్పితో బాధపడుతూ డగౌట్‌కు చేరిపోయాడు. దీంతో ఆ ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీతో కెప్టెన్ రోహిత్ శర్మ వేయించాడు. అలా బౌలింగ్ చేసిన విరాట్.. కేవలం రెండు సింగిల్స్‌ను మాత్రమే ఇవ్వడం గమనార్హం. మీడియం పేస్, స్పిన్‌ను కలిపి వేసిన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్లు షాట్ కొట్టేందుకు కూడా ప్రయత్నించలేదు.
ఆరేళ్ల తర్వాత ఇలా..
Virat Kohli World Cup : గత ఆరేళ్ల తర్వాత విరాట్ తొలిసారి వన్డేల్లో బౌలింగ్ చేయడం విశేషం. చివరిగా 2017 ఆగస్ట్ 31న శ్రీలంకపై రెండు ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చాడు. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా ఒక ఓవర్ వేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో విరాట్ కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. అదే వరల్డ్ కప్‌లో ఆసీస్‌పై ఒక ఓవర్ వేసి 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో ఆసీస్‌పైనే ఒక ఓవర్ బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు మూడు బంతుల్లో కేవలం 2 పరుగులతో ఓవర్‌ను ముగించాడు.
-
Look who rolled over his arm over! 😎
— BCCI (@BCCI) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue | @imVkohli pic.twitter.com/wjTPSLR6BW
">Look who rolled over his arm over! 😎
— BCCI (@BCCI) October 19, 2023
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue | @imVkohli pic.twitter.com/wjTPSLR6BWLook who rolled over his arm over! 😎
— BCCI (@BCCI) October 19, 2023
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue | @imVkohli pic.twitter.com/wjTPSLR6BW
విరాట్ ఖాతాలో అరుదైన ఘనత.. ఒక్క బంతి లెక్కలోకి రాకుండానే వికెట్..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన ఘనత నమోదైంది. 2011లో ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్ సందర్భంగా కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. అయితే, బంతి లెక్కలోకి రాకుండానే ఆ వికెట్ దక్కడం విశేషం. ఎందుకంటే కోహ్లీ బంతిని ఆడే క్రమంలో కెవిన్ ముందుకొచ్చి ఆడబోయాడు. దీంతో ధోనీ వెంటనే స్టంపౌట్ చేసేశాడు. కానీ, ఆ బంతి వైడ్‌గా వెళ్లడం వల్ల 'సున్నా' బంతికే వికెట్ సాధించిన బౌలర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. ఇక విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 8 వికెట్లు కూడా ఉన్నాయి. ఇందులో నాలుగు వన్డేల్లో తీయగా.. మరో నాలుగు టీ20ల్లో పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ నాలుగు వికెట్లు తీసిన చరిత్ర విరాట్‌కు ఉంది.
ODI World Cup 2023 : బంగ్లాతో మ్యాచ్.. కోహ్లీ-రోహిత్ ఈ రికార్డులు సాధిస్తారా?
Ind vs Ban World Cup 2023 : భారత్Xబంగ్లాదేశ్ పోరు.. 'రివెంజ్'కు టీమ్ఇండియా రెడీ!