ETV Bharat / sports

పంత్​ అరుదైన రికార్డు.. కానీ కోహ్లీ అలా చేశాడేంటి? - rishab pant new record

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్​ ఇండియా ప్లేయర్​ రిషభ్​ పంత్​ బుధువారం ఓ అరుదైన రికార్డును సాధించాడు. అయితే స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. ఆ వివరాలు..

rishab pant new record
rishab pant
author img

By

Published : Dec 14, 2022, 3:28 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లలో విఫలమై విమర్శల పాలైన టీమ్​ఇండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆకట్టుకున్నాడు. ఛటోగ్రామ్‌ వేదికగా బుధవారం ఆరంభమైన టెస్ట్​ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న ఈ ​ వికెట్‌ కీపర్‌ 46 పరుగులు సాధించాడు. కానీ 31.4 ఓవర్ వద్ద అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న పంత్‌ను మెహదీ హసన్‌ మిరాజ్‌ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. అయితే ఈ ప్రదర్శనతో అతడు పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

50 సిక్సర్లు.. 31.3వ ఓవర్లో మిరాజ్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ బంతి పంత్‌ డీప్‌ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. తద్వారా టెస్టుల్లో వేగవంతంగా 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ధోని తర్వాత ఆ క్రెడిట్​ పంత్‌కు మాత్రమే.. టీమ్​ఇండియా తరఫున అంతర్జాతీయ ‍క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌ రికార్డు సృష్టించాడు. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ జాబితాలో పంత్‌ కంటే ముందున్నాడు. 535 మ్యాచ్‌లు ఆడిన మహీ మొత్తంగా 17,092 పరుగులు సాధించిన భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.వీటిలో 15 సెంచరీలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి.

మరోవైపు.. ధోని వారసుడిగా పేరొందిన పంత్‌.. ఇప్పటి వరకు ఆడిన 128 మ్యాచ్‌లలో 4021 పరుగులు సాధించాడు. వీటిలో వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తూ 3651 రన్స్‌(109 మ్యాచ్‌లు) చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ట్రాప్‌లో కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీని అద్భుతమైన బంతితో బంగ్లా స్పిన్నర్‌ తైజుల్ ఇస్లామ్‌ బోల్తా కొట్టించాడు. 20 ఓవర్‌ వేసిన తైజుల్ ఇస్లామ్‌ బౌలింగ్‌లో మూడో బంతిని లెగ్‌ సైడ్‌ ఆడటానికి విరాట్​ ప్రయత్నించాడు. అయితే పిచ్‌ మిడిల్‌లో పడ్డ బంతి అద్భుతంగా టర్న్‌ అవుతూ కోహ్లీ వెనుక ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో వికెట్‌ కీపర్‌ ఎల్బీకి అప్పీల్‌ చేయగా..అంపైర్‌ వెంటనే వేలు పైకెత్తాడు. అయితే కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. ఎందుకంటే విరాట్‌ క్లియర్‌గా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు.

టీ బ్రేక్.. కాగా ఈ మ్యాచ్​లో బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తుండటంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. కాగా,టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 56 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.