ETV Bharat / sports

IND VS BAN: గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్‌కు ఎసరు - తొలి టెస్టు బంగ్లాదేశ్ లక్ష్యం

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో శుభమన్​ గిల్​ సెంచరీతో చెలరేగాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న అతడు ఈ మార్క్​ను అందుకున్నాడు. ఇతడు ఇకపై ఇలానే జోరు కొనసాగిస్తే కేఎల్ రాహుల్​ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Gill
IND VS BAN: గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్‌కు ఎసరు
author img

By

Published : Dec 16, 2022, 5:25 PM IST

దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుభ్​మన్‌ గిల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే వెనుదిరిగినా .. రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. ఈ సంవత్సరం టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. మొత్తం 152 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేశాడు. మెహదీ వేసిన 50వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన గిల్.. అదే ఓవర్‌లో మూడో బంతికి హసన్‌ జాయ్‌ (సబ్‌స్టిట్యూట్‌)కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

శుభమన్​ గిల్ 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో (45), రెండో ఇన్నింగ్స్‌లో (35) పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 709 పరుగులు చేయగా.. 15 వన్డేల్లో 687 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి గిల్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే టెస్టుల్లో రోహిత్‌ శర్మకి జోడీగా కేఎల్ రాహుల్‌ (KL Rahul)కి బదులు గిల్‌ని తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా మరో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో (22), రెండో ఇన్నింగ్స్‌లో (23) పరుగులే చేసి నిరాశపర్చాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ విఫలమైతే అతడి ఓపెనింగ్‌ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఇక, బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ విషయానికొస్తే.. మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసమయానికి 12 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా 471 పరుగులు చేస్తే బంగ్లా విజయం సాధిస్తుంది.

అంతకుముందు శుబ్‌మన్‌ గిల్(110), ఛెతేశ్వర్ పుజారా(102**) శతకాలు సాధించారు. గిల్‌ కిది తొలి సెంచరీ కాగా.. పుజారా దాదాపు నాలుగేళ్ల(1443 రోజులు) తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం. ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 150 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 258/2 స్కోరుకు డిక్లేర్డ్‌ చేసింది.

ఇదీ చూడండి: IND VS BAN: ముగిసిన మూడో రోజు ఆట.. నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.