బంగ్లాతో టీమ్ఇండియా ఆడుతున్న టెస్టులో విరాట్ కోహ్లీ పరువు కాపాడాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. కొన్ని నెలలుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ విమర్శల పాలవుతున్న రిషభ్ పంత్.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా అందుకున్న క్యాచ్‌తో విరాట్ కోహ్లీ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కోహ్లీ ఫ్యాన్స్ అంతా మెచ్చుకునే పని పంత్ ఏం చేశాడంటే..
చిట్టగాంగ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్ ఓడింది. కనీసం టెస్టు సిరీస్‌లోనైనా గెలవాలని కసితో ఉంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసి మంచి ప్రదర్శనతో 404 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను భారత్ బౌలర్లు వణికించారు. సిరాజ్ (3), కుల్దీప్ (5) వికెట్లతో చెలరేగడంతో.. బంగ్లా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.
దీంతో టీమిండియాకు 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుపు ప్రదర్శన కొనసాగించారు. దీంతో 258 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. 513 పరుగుల టార్గెట్‌ను బంగ్లా ముందు ఉంచింది. ఆపై బ్యాచింగ్కు దిగిన బంగ్లాదేశ్ వికెట్లు పోకుండా ఆడుతూ.. భారత బౌలర్లకు సవాల్ విసిరారు.
ఆ క్యాచ్‌తో తొలి వికెట్ డౌన్..
బౌలర్లను మార్చి బౌలింగ్ వేస్తున్నా వికెట్ పడలేదు. దీంతో 47వ ఓవర్లో బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్.. స్లిప్‌లో ఉన్న విరాట్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనూహ్యంగా ఆ బంతి కోహ్లీ చేతిలోంచి జారిపోయింది. దీన్ని గమనించిన రిషభ్ డై చేస్తూ.. బంతిని క్యాచ్ పట్టాడు. దీంతో 100 పైగా భాగస్వామ్యాన్ని తొలి వికెట్ తీసి విడగొట్టారు. దీంతో విరాట్ పరువు పోకుండా రిషబ్ కాపాడాడని నెటిజన్ల పోస్టులు పెడుతున్నారు.
-
A solid relay catch to break the solid partnership 🤯#TeamIndia gets the much-needed breakthrough courtesy of brilliant reflexes from @RishabhPant17 🙌#SonySportsNetwork #BANvIND@imVkohli pic.twitter.com/nbSfoMvhzd
— Sony Sports Network (@SonySportsNetwk) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">A solid relay catch to break the solid partnership 🤯#TeamIndia gets the much-needed breakthrough courtesy of brilliant reflexes from @RishabhPant17 🙌#SonySportsNetwork #BANvIND@imVkohli pic.twitter.com/nbSfoMvhzd
— Sony Sports Network (@SonySportsNetwk) December 17, 2022A solid relay catch to break the solid partnership 🤯#TeamIndia gets the much-needed breakthrough courtesy of brilliant reflexes from @RishabhPant17 🙌#SonySportsNetwork #BANvIND@imVkohli pic.twitter.com/nbSfoMvhzd
— Sony Sports Network (@SonySportsNetwk) December 17, 2022
ఇవీ చదవండి : అది కోహ్లీ రేంజ్.. ఆ లిస్ట్ టాప్-5లో చోటు.. కత్రిన, అలియా కూడా..