ETV Bharat / sports

బంగ్లాపై విజయం.. కెప్టెన్​గా రాహుల్​ అరుదైన రికార్డు.. రోహిత్‌కు సాధ్యం కాని దాన్ని.. - కేఎల్​ రాహుల్​ వార్తుల

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్ట్​లో టీమ్​ఇండియా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో విజయం సాధించడంతో పాటు రాహల్​ కెప్టెన్​గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేంటంటే?

kl rahul
kl rahul
author img

By

Published : Dec 18, 2022, 6:30 PM IST

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంతోని టీమ్​ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాపై విజయం సాధించడంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌.. విదేశాల్లో మూడో ఫార్మాట్లలో టీమ్​ఇండియాను గెలిపించిన ఐదో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానే మాత్రమే టీ20, వన్డే, టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై టీమ్​ఇండియాను విజయపథంలో నడిపించారు. టీమ్​ఇండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని ఈ రికార్డును రాహుల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన రాహుల్, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘాన్‌పై టీ20 సిరీస్​ను కైవసం చేసుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో విజయం సాధించడంతో విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమ్​ఇండియాను గెలిపిం‍చిన దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.

మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో టీమ్​ఇండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌కు కూడా సారధ్యం వహించలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్‌లో, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టు మ్యాచ్‌కు రోహిత్‌ గాయాల కారణంగా దూరంగా ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.