ETV Bharat / sports

నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్.. స్టేడియంలో మోదీ, అల్బనీస్ సందడి - నాలుగో టెస్ట్ మ్యాచ్​కు ప్రధాని మోదీ

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగోటెస్టు తొలిరోజు ఆటను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి హాజరయ్యారు.

ind vs aus 4th test match
ind vs aus 4th test match
author img

By

Published : Mar 9, 2023, 9:16 AM IST

Updated : Mar 9, 2023, 11:15 AM IST

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3-1తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది. అలా జరిగితేనే ఏ సమీకరణాలతో పని లేకుండా టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.

కాగా, స్టేడియంలో ఇద్దరు ప్రధానమంత్రులు సందడి చేశారు. నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్రమోదీ.. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనతో కలిసి వీక్షించారు. ఆ తర్వాత స్టేడియంలోని ఓ గోల్ఫ్‌ కారులో ప్రధాని మోదీ, అల్బనీస్​ కాసేపు తిరిగారు. స్టేడియంలోని​ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం రెండు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ ఇద్దరు ప్రధానులను సత్కరించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ.. ఆసీస్‌ ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేయగా. బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రధాని మోదీకి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.

ind-vs-australia-4th-test-series
ఇరు జట్ల కెప్టెన్లతో ప్రధానులు
ind-vs-australia-4th-test-series
ప్రత్యేక వాహనంలో ప్రధానులు

ఇక మ్యాచ్​ ప్రారంభం కాక మందు ఇరు జట్ల కెప్టెన్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానులు వారికి టెస్ట్​ క్యాప్​లను అందజేశారు. ఆ తర్వాత మైదానంలోకి చేరుకుని వారితో కలిసి తమ జాతీయ గీతాలను ఆలపించారు. ఇండియా ఆసీస్​ జట్లను కలిసిన ప్రధానులు వారికి కరచాలనం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంను కూడా సందర్శించి కాసేపు ముచ్చటించారు. ఈ వీడియోలను బీసీసీఐ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. మ్యాచ్‌ మొదలవగానే వీరిద్దరూ కలిసి ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని వీక్షించారు.

ind-vs-australia-4th-test-series
జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మోదీ
ind-vs-australia-4th-test-series
హాల్​ ఆఫ్​ ఫేమ్​ను వీక్షిస్తున్న ప్రధానులు

టాస్ కోసం ప్రత్యేక కాయిన్​ను తయారు చేయించింది బీసీసీఐ. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది ఆసీస్​ టీమ్​. అహ్మదాబాద్ పిచ్ గత మ్యాచ్​లతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్​పై అక్కడక్కడా పచ్చిక కూడా ఉంది. గతేడాది ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో అహ్మదాబాద్ పిచ్.. అనూహ్యంగా టర్న్ అయింది. అయితే, ఈ సారి పేసర్లకు కూడా పిచ్ నుంచి సహకారం అందుతుందని చెబుతున్నారు. స్పిన్నర్లు అధిక వికెట్లు సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Last Updated : Mar 9, 2023, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.