Ind Vs Aus Women ODI : ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. శనివారం హోరా హోరీగా జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా జట్టు వీరోచితంగా పోరాడింది. అయితే ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలవ్వడం వల్ల గెలుపు ఆసీస్‌కు దక్కింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేయగలిగింది. అయితే 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. దీంతో మూడు పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిని చవి చూసింది. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్‌కీపర్ రిచా ఘోష్ (96) కష్టపడ్డప్పటికీ ఆ శ్రమ వృథా అయిపోయింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ (44) కూడా ఈ మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసి జట్టుకు తన వంతు సహాయం అందించింది.
మరోవైపు స్మృతి మంధాన కూడా 34 పరుగులు చేసి జట్టుకు స్కోర్ అందించింది. అయితే యాస్తికా భాటియా (14), హర్మన్‌ప్రీత్ కౌర్ (5) మాత్రం తమ ఆట తీరుతో నిరాశపరిచారు. రిచా ఘోష్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో మాత్రం వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీప్తి శర్మ (24*), శ్రేయంక పాటిల్ (5*) నాటౌట్‌గా నిలిచారు.
ఇక ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, జార్జియా వేర్‌హామ్ 2, కిమ్ గార్త్, అలానా కింగ్, ఆష్లీన్ గార్డ్‌నర్ చెరీ వికెట్ పడగొట్టారు. ఇక మూడో టీ20 జనవరి2న (మంగళవారం) జరగనుంది. అయితే ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (63), ఎలిస్ పెర్రీ (50), అర్ధ శతకాలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జార్జియా వేర్‌హామ్ (22), తాలియా మెక్‌గ్రాత్ (24), అనాబెల్ సదర్లాండ్ (23) పరుగులు చేశారు. బెత్ మూనీ (10), అలీసా హీలే (13), ఆష్లీన్ గార్డ్‌నర్ (2) మాత్రం నిరాశ పరిచారు. చివర్లో కిమ్ గార్త్ (11*) సహకారంతో అలానా కింగ్ (28*) దూకుడుగా ఆడింది. భారత ఆల్‌రౌండర్, స్పిన్నర్ దీప్తిశర్మ (5/38) ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగింది. శ్రేయంక పాటిల్, పుజా వస్త్రాకర్, స్నేహ్ రాణాకు తలో వికెట్ దక్కింది.
సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో పోరు - హర్మన్‌ప్రీత్‌కు పగ్గాలు
'ఏకైక టెస్ట్‌లో ఓడినా మనసులు గెలిచేశావ్గా'- హీలీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!