Ind Vs Aus ODI : మెహాలీ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సర్వం సిద్ధంగా ఉంది. వన్డే ప్రపంచకప్ ముందు ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనున్న ఈ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక మొదటి రెండు వన్డేలకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. మూడో వన్డే సమయానికి విశ్రాంతిలో ఉన్న ఆ నలుగురు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. దీంతో రానున్న మొదటి రెండు వన్డేల్లో టీమ్‌ఇండియాకు ఆసీస్ గట్టిపోటీనే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఇరు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి, అందులో ఆధిపత్యం ఎవరిది? ఇక మొదటి వన్డేలో ఎటువంటి రికార్డులు నమోదయ్యే అవకాశాలనున్నాయో ఓ సారి చూద్దాం.
India Vs Australia ODI Series : వన్డేల్లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌దే ఆధిపత్యంగా ఉంది. ఇప్పటివరకు ఈ జట్ల మధ్య 146 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ఆస్ట్రేలియా 82 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక టీమ్‌ఇండియా 54 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 10 మ్యాచ్‌లకు గానూ ఫలితం తేలలేదు. వీటిలో భారత్‌లో 67 మ్యాచ్‌లు జరగ్గా అందులో కంగారూల జట్టు 32 సార్లు నెగ్గింది. 30 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 5 మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు.
-
Preps before the start of a cracking series 👌 😎#TeamIndia | #INDvAUS pic.twitter.com/Jmwm7FkfmN
— BCCI (@BCCI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Preps before the start of a cracking series 👌 😎#TeamIndia | #INDvAUS pic.twitter.com/Jmwm7FkfmN
— BCCI (@BCCI) September 21, 2023Preps before the start of a cracking series 👌 😎#TeamIndia | #INDvAUS pic.twitter.com/Jmwm7FkfmN
— BCCI (@BCCI) September 21, 2023
ఈ క్రమంలో ఇప్పుడు జరగనున్న మొదటి వన్డేలో విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా జట్టుగా టీమ్‌ఇండియా అవతరిస్తుంది. ప్రస్తుతం 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్.. ఆ ర్యాంకింగ్‌తో లీడ్‌లో పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి టాప్ పొజిషన్లో నిలుస్తుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా టీ20లు, టెస్టుల్లో నంబర్ వన్‌గా రాణిస్తున్న ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న మొదటి వన్డేలో నమోదవ్వనున్న రికార్డులు ఇవే..
- డేవిడ్ వార్నర్ 1 సిక్స్ బాదితే వన్డేల్లో 100 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
- తన అంతర్జాతీయ కెరీర్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకోవడానికి కామెరూన్ గ్రీన్‌కు 2 వికెట్లు అవసరం
- కేఎల్ రాహుల్ మరో రెండు సిక్స్‌లు బాదితే వన్డేల్లో 50 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
- రవిచంద్రన్ అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే రికార్డును (142) అధిగమించి ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు.
- మార్కస్ స్టాయినిస్ మరో ఐదు సిక్స్‌లు బాదితే వన్డే క్రికెట్‌లో 50 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
- వన్డేల్లో స్టీవ్ స్మిత్ మరో 61 పరుగులు చేస్తే 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
- మార్నస్ లబుషేన్ మరో 79 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
- అన్ని ఫార్మాట్లలో మిచెల్ మార్ష్ 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి అతనికి 87 పరుగులు అవసరం.
KL Rahul Australia Series : ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రాహుల్ కెప్టెన్సీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?