ETV Bharat / sports

సిరీస్​పై టీమ్ఇండియా గురి - ఆసీస్ పరువు దక్కించుకునేనా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 6:43 AM IST

Ind vs Aus 3rd T20 : ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్​ల సిరీస్​లో తొలి రెండింట్లో నెగ్గి టీమ్ఇండియా జోరుమీదుంది. మంగళవారం జరిగే మూడో టీ20​లోనూ గెలిచి.. మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది.

Ind vs Aus 3rd T20
Ind vs Aus 3rd T20

Ind vs Aus 3rd T20 : ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా.. మంగళవారం గువాహటి వేదికగా భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. తొలి రెండు టీ20ల్లో నెగ్గి ఊపుమీదున్న టీమ్ఇండియా.. మూడో మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. ప్రపంచకప్​ గెలిచిన జట్టుగా.. ఈ మ్యాచ్​లోనైనా నెగ్గి సిరీస్​లో బోణీ కొట్టాలని ఆసీస్ ఆశిస్తోంది.

ఆత్మవిశ్వాసంతో బరిలోకి : సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో పూర్తి ఆత్మ విశ్వాసంతో టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. టాపార్డర్ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్​ అద్భతమైన ఫామ్​లో ఉన్నారు. గత మ్యాచ్​లో ఈ ముగ్గురూ 50+ స్కోర్లు చేసి.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. ఇక కెప్టెన్ సూర్య, లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ మిడిలార్డర్​లో, చివర్లో రింకు సింగ్ రాణిస్తే.. టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి 200+ స్కోర్ నమోదు చేస్తుందనడంలో సందేహం లేదు.

బౌలింగ్ గుబులు.. తొలి రెండు మ్యాచ్​ల్లో గెలిచినప్పటికీ.. టీమ్ఇండియా బౌలింగ్ కాస్త కలవరపెడుతోంది. మొదటి టీ20లో 200+ పై పరుగులివ్వగా.. రెండో మ్యాచ్​లో 191 పరుగులు సమర్పించుకున్నారు టీమ్ఇండియా బౌలర్లు. అయితే టార్గెట్ పెద్దది కావడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ భారత్ 200 లోపు స్కోర్ చేస్తే.. బౌలర్లకు అసలు సవాల్ ఎదురుకానుంది. ప్రసిద్ధ్ కృష్ణ గత మ్యాచ్​లో 3 వికెట్లు తీసినా.. 10.20 ఎకనమీతో, అర్షదీప్ 11.50 , ముకేశ్ కుమార్ 10.80 ఎకనమీతో పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్​లోనైనా బౌలర్లు పుంజుకొని ఆసీస్ బ్యాటర్లకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఆసీస్ బోణీ కొట్టేనా.. వరల్డ్​కప్ గెలిచిన తర్వాత.. వరుసగా రెండు మ్యాచ్​ల్లో డీలాపడిన ఆసీస్ ఈ సిరీస్​ను ప్రతష్ఠాత్మకంగా తీసుకునే ఛాన్స్ ఉంది. స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ షార్ట్‌తో బ్యాటింగ్​ బలంగా ఉంది. కానీ, బౌలింగ్ మెరుగుర్చుకుంటేనే తప్ప టీమ్ఇండియా జోరుకు బ్రేకులు వేయలేరు.

తుది జట్లు (అంచనా)..

భారత్‌ : యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.

ఆస్ట్రేలియా : స్మిత్‌, మాథ్యూ షార్ట్‌, ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌, ఆడమ్‌ జంపా, నాథన్‌ ఎలిస్‌, బెరెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా

'అలా బ్యాటింగ్ చేయడం సరదా - నా రోల్ ఏంటో నాకు తెలుసు'- ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్న రింకూ, ఇషాన్

వరల్డ్​ కప్​లు గెలవడం అంత సులువు కాదు- వచ్చే టీ20 ప్రపంచ కప్​ భారత్​దే! : రవి శాస్త్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.