ETV Bharat / sports

Ind vs Afg World Cup 2023 : అర్ధ శతకం సాధించిన ఒమర్జాయ్‌, హష్మతుల్లా

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 1:34 PM IST

Updated : Oct 11, 2023, 4:38 PM IST

Ind vs Afg World Cup 2023 live updates
Ind vs Afg World Cup 2023 live updates

16:35 October 11

అర్ధ శతకాన్ని సాధించిన హష్మతుల్లా (50*).. అఫ్గన్ ప్రస్తుత స్కోర్ 173-3

16:32 October 11

  • అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (50*) అర్ధ శతకానికి నమోదు చేశాడు.

15:20 October 11

  • రెండో వికెట్​ పడిన కొద్ది సేపటికే అఫ్గాన్​ మరో వికెట్​ను కోల్పోయింది. శార్దూల్​ బౌలింగ్​ దెబ్బకు ఎల్​బీ డబ్ల్యూగా వెనుతిరిగిన రహ్మత్​ షా(16)

15:17 October 11

  • హార్దిక్ వేసిన 12.4వ ఓవర్ వద్ద అఫ్గాన్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. షార్ట్‌ పిచ్‌ బంతిని కొట్టే క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద గుర్బాజ్ శార్దూల్‌కు దొరికిపోయాడు. దీంతో 21 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు.

14:29 October 11

  • 32 పరుగుల వద్ద అఫ్గాన్​ తొలి వికెట్​.. బుమ్రా వేసిన బంతికి రాహుల్​ చేతిలో క్యాట్​ ఔట్ అయిన జర్దాన్​

14:26 October 11

బంతి వికెట్లను తాకకుండా వెళ్లినట్లు రిప్లేలో వచ్చింది. దీంతో భారత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం దక్కలేదు.

14:26 October 11

దూకుడుగా ఆడుతున్న జర్డాన్​.. సిరాజ్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. మూడో బంతికి ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

14:22 October 11

నాలుగు ఓవర్లకు అఫ్గాన్​ స్కోర్​ 18. క్రీజులో ఉన్న జర్డాన్​(16), గుర్బాజ్​(1)

14:19 October 11

3వ ఓవర్​లో కట్టుదిట్టంగా బంతులను సంధించిన బుమ్రా.

14:13 October 11

తొలి ఓవర్‌ను అద్భుతంగా వేసిన బుమ్రా.. ఇన్‌స్వింగర్లతో అఫ్గాన్‌ను భయపెట్టి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అది కూడా వైడ్‌ కావడం గమనార్హం.

12:44 October 11

Ind vs Afg World Cup 2023

Ind vs Afg World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భాగంగా భారత్​ రెండో మ్యాచ్​ ఆడుతోంది. దిల్లీ అరుణ్ జైట్లీ మైదానం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్​తో తలపడుతోంది. టాస్ గెలిచిన అఫ్గాన్​ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇక తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్​లోనూ జయకేతనం ఎగురవేయాలని ఆశిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్​లో బంగ్లాదేశ్ చేతిలో బంగపడ్డ అఫ్గాన్​.. బలమైన టీమ్ఇండియాకు గట్టిపోటీనిచ్చి ఎలాగైనా గెలచి మెగాటోర్నీలో బోణీ కొట్టాలని తహతహలాడుతోంది. అస్వస్థత కారణంగా టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్​ ఈ మ్యాచ్​కు కూడా దూరమయ్యాడు.

టీమ్ఇండియాకు గుడ్​న్యూస్. డెంగీతో బాధపడుతున్న శుభ్​మన్ గిల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతడు బుధవారం అహ్మదాబాద్​ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్.. అక్టోబర్ 14న అహ్మదాబాద్​లో దాయాది పాకిస్థాన్​తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. బహుశా గిల్​ మ్యాచ్​ కోసమే అహ్మదాబాద్ వచ్చి ఉంటాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

టీమ్ఇండియా తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్​దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,
అఫ్గానిస్థాన్ తుది జట్టు : రహ్మానుల్లా గుర్భాజ్, ఇబ్రహిమ్ జర్డాన్, రహ్మత్ షా, హశ్మతుల్లా షహీదీ(కెప్టెన్), నజీబుల్లా జర్డాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ అర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్​హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్, ఫజల్​హక్ ఫరూకీ.

Last Updated : Oct 11, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.