IND VS AFG Rohit Sharma T20 Win Record : టీమ్ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డులో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించడం ద్వారా హిట్ మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. రోహిత్ ఈ మార్క్‌ను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. అసలీ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతడి ఖాతాలో వరల్డ్ రికార్డు చేరడం విశేషం.
మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ పేరిట ఉంది. ఆమె 111 టీ20 విజయాల్లో భాగమైంది. పురుషుల క్రికెట్‌లో హిట్ మ్యాన్ తర్వాత ఈ అత్యధిక విజయాల రికార్డు పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ పేరిట ఉంది. అతడు 124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు సాధించాడు. ఇక రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లీది. విరాట్ 115 మ్యాచ్‌ల్లో 73 విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20 విజయాల్లో విరాట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ నబీలు చెరో 70 విజయాతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ ఓ అరుదైన గుర్తింపును సాధించాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలను దక్కించుకోవడం విశేషం.
-
1ST T20I. India Won by 6 Wicket(s) https://t.co/BkCq71Zm6G #INDvAFG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">1ST T20I. India Won by 6 Wicket(s) https://t.co/BkCq71Zm6G #INDvAFG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 11, 20241ST T20I. India Won by 6 Wicket(s) https://t.co/BkCq71Zm6G #INDvAFG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 11, 2024