ETV Bharat / sports

వాయుసేన విన్యాసాలు, పాప్ సింగర్ ప్రదర్శన, మోదీ హాజరు- ప్రపంచకప్ ఫైనల్ అదిరిపోవాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 9:55 PM IST

World Cup Final 2023 : ప్రపంచకప్‌ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన క్రికెట్‌ మహా సంగ్రామం మరో రెండు రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ వినోదానికి తెరపడనుంది. అయితే, ఫైనల్ మ్యాచ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మ్యాచ్​ను వీక్షించేందుకు రానున్నారు.

world cup final 2023
world cup final 2023

World Cup Final 2023 : ఐసీసీ ప్రపంచకప్​ ముగింపు దశకు చేరింది. విశ్వవిజేత ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరు కోసం సర్వం సిద్ధమైంది. అయితే, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్​ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ముగింపు వేడుకలను అదే స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

world cup final 2023
స్టేడియం ఎదుట అభిమానుల సందడి

వాయు సేన విన్యాసాలు ఫైనల్​కు అదనపు ఆకర్షణగా నిలవన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్‌ విమానాలు నరేంద్ర మోదీ స్టేడియంపై విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఫైనల్‌ ఆరంభమయ్యే పది నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. అందుకు సన్నాహకంగా సూర్యకిరణ్‌ విమానాలు శుక్రవారం రిహార్సల్స్‌ నిర్వహించాయి. 9 విమానాలు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సూర్యకిరణ్‌ విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ఐకానిక్‌ స్టేడియం పక్కనే నివాసం ఉండటం తమ అదృష్టమని వారన్నారు.

world cup final 2023
స్టేడియం వద్ద వైమానిక దళ విన్యాసాలు
world cup final 2023
స్టేడియం వద్ద వైమానిక దళ విన్యాసాలు

భారత ప్రధాని, ఆసీస్ డిప్యూటీ ప్రధాని హాజరు
ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్స్​ మార్లెస్​ సైతం రానున్నారు. ఈ మేరకు గుజరాత్ హోమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

The preparations are on at the Narendra Modi Stadium. (Video - ICC). pic.twitter.com/L2pNZ2lsUB

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాప్ సింగర్ ప్రదర్శన
మరోవైపు ముగింపు వేడుకలకు హాలీవుడ్‌, అల్బేనియన్‌ పాప్‌ సింగర్‌ దువా లిపాతో ఓ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ.. ముగింపు వేడుకల్లో లిపా ఈవెంట్‌ ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

world cup final 2023
స్టేడియం ఎదుట అభిమానుల సందడి

అహ్మదాబాద్​లో జరిగే ఈ ఫైనల్​ మ్యాచ్​ కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్​ అంతర్జాతీయ విమానాశ్రయం. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రయాణ ఏర్పాట్లు చేసింది. విమానాలను నిలిపేందుకు 15 స్టాండ్లను ఏర్పాటు చేయగా.. రాత్రి పార్కింగ్ కోసం ఎస్​ఓపీని సిద్ధం చేసింది. వీటితో పాటు సమీపంలోని ఇతర విమానాశ్రయాలను సంప్రదించి అక్కడి స్టాండ్లను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది.

ఫైనల్​ మ్యాచ్​ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. బ్లాక్​లో టికెట్​ ధరకు పది రెట్లు చెల్లించి మరీ కొంటున్నారు. ఆన్​లైన్​తో పాటు స్టేడియంకు చేరుకుని ఆఫ్​లైన్​లో దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు. రూ.2 వేల టికెట్​ను రూ.20వేలకు.. రూ.4వేల టికెట్​ను రూ.40వేలకు విక్రయిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.